Trump-China: హార్ముజ్ తెరిచి ఉంచాం.. చైనా సంతోషంగా ఉందన్న ట్రంప్
- హార్ముజ్ తెరిచి ఉంచాం
- ప్రపంచ దేశాల కోసం తెరిచాం
- చైనా సంతోషంగా ఉందన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇది చైనా కోసం మాత్రమే కాదని.. ప్రపంచ దేశాల కోసం తెరిచి ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ రాసుకొచ్చారు. ఇకపై హార్ముజ్ జలసంధి దగ్గర ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండబోవని తెలిపారు. తన నిర్ణయం పట్ల చైనా సంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా హామీ కూడా ఇచ్చిందన్నారు. త్వరలోనే చైనా వెళ్తున్నానని.. అక్కడ పెద్ద స్థాయిలో ఘన స్వాగతం.. ప్రత్యేక ఆతిథ్యం లభిస్తుందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: INDIA Bloc: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
Also Read
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఆయా దేశాల్లో ధరలు కూడా ఆకాశన్నంటాయి. అయితే ప్రస్తుతం రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఇక ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. మరోసారి చర్చలకు సిద్ధపడుతున్నారు. ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

తాజావార్తలు
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!