Site icon NTV Telugu

Trump: త్వరలో రష్యా చమురు కొనుగోలు భారత్ నిలిపివేస్తుంది.. మరోసారి ట్రంప్ కీలక ప్రకటన

Trump

Trump

త్వరలో రష్యా చమురు కొనుగోలు భారత్ నిలిపివేస్తుందని మరోసారి ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇటీవలే ప్రధాని మోడీతో మాట్లాడినప్పుడు తనకు హామీ ఇచ్చారని.. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రకటనను భారత్ ఖండించింది. ట్రంప్-మోడీ మధ్య అలాంటి సంభాషణ ఏం జరగలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తాజాగా మరోసారి అదే ప్రకటన ట్రంప్ రిపీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Maithili Thakur: ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తా.. అలీనగర్‌లో నామినేషన్ వేసిన మైథిలి ఠాకూర్

శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ సమావేశం అయ్యారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంపై చర్చించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేస్తుందని ప్రధాని మోడీ చెప్పినట్లుగా గుర్తుచేశారు. ఇప్పటికే చమురు కొనుగోలు తగ్గించారని.. భవిష్యత్‌లో మరింత తగ్గిస్తారని చెప్పుకొచ్చారు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకపోతే వివాదాన్ని ముగించడం చాలా సులభం అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అని.. భారతదేశం అద్భుతమైన దేశంగా అభివర్ణించారు.

ఇది కూడా చదవండి: Pakistan-Afghan War: పాకిస్థాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా 8 మంది మృతి

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని.. రువాండా-కాంగో, భారత్-పాకిస్థాన్ గురించి ప్రస్తావించారు. యుద్ధాలను పరిష్కరించినప్పుడు నోబెల్ బహుమతి వస్తుందని నాయకులంతా చెప్పారని.. తీరా చూస్తే తనకు రాలేదన్నారు. ఎవరికో నోబెల్ ఇచ్చారని.. ఆమె కూడా చాలా మంచి మహిళ అని.. ఆమె ఎవరో తనకు తెలియదన్నారు. అయినా ఆ విషయాలేమీ పట్టించుకోను అన్నారు. తనకు ప్రాణాలను కాపాడటంపైనే శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు తెలిసినంతవరకు యుద్ధాలను పరిష్కరించిన చరిత్ర.. అమెరికా అధ్యక్ష చరిత్రలోనే లేదన్నారు. బుష్ అయితే యుద్ధాన్నే ప్రారభించారని.. కానీ తాను మాత్రం 10 లక్షల మంది ప్రాణాలు కాపాడినట్లు చెప్పుకొచ్చారు. తాను 10 లక్షల మంది ప్రాణాలను కాపాడినట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి కూడా చెప్పారని గుర్తుచేశారు. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపకపోతే.. ఆ రెండు దేశాలు ఏమైపోయేవో అని పేర్కొన్నారు. ఇక ఆప్ఘనిస్థాన్ యుద్ధాన్ని ఆపడం సులభమే అని తెలిపారు. యుద్ధాలను పరిష్కరిస్తూనే.. అమెరికాను కూడా చూసుకోవాలి కదా? అన్నారు. అయితే యుద్ధాలను ఆపడం ఇష్టం.. ఎందుకుంటే ప్రజల ప్రాణాలను కాపాడం ఇష్టం.. అందుకే యుద్ధాలను ఆపుతున్నట్లు ట్రంప్ వివరించారు.

Exit mobile version