Site icon NTV Telugu

Donald Trump: ట్రంప్ ఇంట్లో వార్తాపత్రికలు, మ్యాగజైన్ల మధ్య దేశ రహస్య పత్రాలు..

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇంట్లోని వివిధ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, వ్యక్తిగత కరస్పాండెన్స్‌తో కలిపి రహస్య పత్రాలను దాచిపెట్టారని ఎఫ్‌బీఐ తన అఫిడవిట్‌లో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడా ఎస్టేట్ నుండి స్వాధీనం చేసుకున్న 15 పెట్టెల్లో పద్నాలుగు రహస్య పత్రాలు లభించాయి. వీటికి సంబంధించిన అఫిడవిట్‌ను ఎఫ్‌బీఐ తాజాగా బయటపెట్టింది. ఫ్లోరిడాలో ట్రంప్‌కు చెందిన మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌లో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ చేపట్టిన సోదాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Vigilance Raids: ఇంజినీర్ ఇంటిపై విజిలెన్స్‌ దాడులు.. గుట్టలుగా బయటపడిన నోట్ల కట్టలు

మార్-ఎ-లాగో ఎస్టేట్‌ను ట్రంప్‌, ఆయన సిబ్బంది, కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశానికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను ఇక్కడకు తరలించినట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఈ ఎస్టేట్‌లో చేపట్టిన సోదాల్లో 15 పెట్టెల్లో పత్రాలు లభించాయి. ఈ తనిఖీలకు సంబంధించిన అఫిడవిట్‌ను ఎఫ్‌బీఐ తాజాగా బయటపెట్టింది. ఈ బాక్సుల్లో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ పత్రాలను వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, వ్యక్తిగత కరస్పాండెన్స్‌తో కలిపి ఉంచినట్లు తెలిసింది.

Exit mobile version