అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఎటాక్ తర్వాత సోమవారం న్యూయార్క్ ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ షేర్లు అదరగొట్టాయి. ఏకంగా 70 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే హత్యాయత్నం తర్వాత అతనిపై సానుభూతి కూడా విపరీతంగా పెరిగింది. అలాగే ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విక్టరీ గ్రాఫ్ పెరిగిన క్రమంలో ఆయనకు చెందిన కంపెనీ షేర్లు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవుతారని చాలా మంది ఇన్వెస్టర్లు నమ్ముతుండడమే షేర్లు పెరిగేందుకు కారణమైనట్లు పలు మీడియాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Vicky Kaushal: కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన విక్కీ కౌశల్.. ఏమన్నారంటే..?
గతంలో డొనాల్డ్ ట్రంప్ మీడియా కంపెనీ స్టాక్ ఏకంగా 37 శాతం మేర పడిపోయింది. అయితే ఒక్క దెబ్బతో ఆ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చేసింది స్టాక్. సోమవారం ప్రీమార్కెట్ ర్యాలీతో భారీగా లాభాలు వచ్చాయి. గత శనివారం రోజున పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తున్న ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఆయన చెవికి గాయమైంది. దుండగుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టాయి. ఆ తర్వాత తాను క్షేమంగానే ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ప్రసాద్ ఐమాక్స్ లో 18 రోజులకు 4.8 కోట్లు!!