G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్‌పై కీలక వ్యాఖ్యలు
- ఫ్రాన్స్‌లో ట్రంప్ పర్యటన
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ
- ఉక్రెయిన్-రష్యా వార్‌పై కీలక వ్యాఖ్యలు
- ప్రధాని మోడీని కూడా కలవనున్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌తో యుద్ధం వేళ జీ 7 సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఒప్పందంతో ప్రపంచానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా కొంతకాలంగా అంతరాయం ఎదుర్కొన్నప్పటికీ.. ఇరాన్ ఒప్పందంతో పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు. “మేము కుదుర్చుకున్న ఇరాన్ ఒప్పందం ప్రపంచానికి ఎంతో విజయాన్ని తీసుకువస్తుంది. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి” అని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
- Pakistan Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది కార్మికులు మృతి
- ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “మీ సహాయానికి ధన్యవాదాలు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కూడా స్పందించారు. “నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో చాలా మంచి సంభాషణ జరిగింది. ఏదైనా పరిష్కారం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరూ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది” అని చెప్పారు. ఇరాన్ సంక్షోభం దాదాపు ముగిసిన నేపథ్యంలో ఇక తమ దృష్టి ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా మళ్లుతుందని ట్రంప్ వెల్లడించారు. “ఇప్పుడు ఈ సమస్య (ఇరాన్ సంక్షోభం) ముగిసిన తర్వాత మేము ఉక్రెయిన్ అంశంపై దృష్టి సారిస్తాం. ఆ సమస్యకు కూడా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తాం” అని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ ఒప్పందం, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా తదుపరి వ్యూహంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
జీ 7 సదస్సులో భాగంగా ప్రధాని మోడీతో ట్రంప్ సమావేశం కానున్నారు. రేపటి నుంచి రెండ్రోజులు మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గతేడాది వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను మోడీ కలిశారు. అయితే వాణిజ్య సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య విభేదాలు రావడంతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ట్రంప్‌తో మోడీ భేటీకానున్నారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
#WATCH | Evian, France: At high-stakes meeting with French President Emmanuel Macron, US President Donald Trump says, "The Iran deal that we made is going to bring a lot of success to the world because the oil was really clogged up there (Strait of Hormuz) for a while…I want to… pic.twitter.com/UfxCa5kBkT
— ANI (@ANI) June 15, 2026
తాజావార్తలు
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Anil Ravipudi: త్రివిక్రమ్‌ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!