Zelensky: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ప్రజామోదం రేటింగ్ అమాంతం పెరిగింది. శుక్రవారం ప్రచురించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన అప్రూవల్ రేటింగ్ మరో 10 శాతం పెరిగినట్లు తేలింది. కీవ్ ఇంటర్నేషల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన పోల్‌లో, ఉక్రెయిన్లలో 67 శాతం మంది జెలెన్ స్కీని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గత నెల ఇది 57 శాతం ఉంది. ఎప్పుడైతే జెలెన్ స్కీని ట్రంప్ ‘‘నియంత’’ అని పిలిచాడో అప్పటి నుంచి ఆయన రేటింగ్ పెరిగింది.
Read Also: Jaishankar security breach: “యూకే ఉదాసీనత”.. జైశంకర్ భద్రతా ఉల్లంఘనపై భారత్ కామెంట్స్..
తాజా పోల్ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 4 మధ్య నిర్వహించబడింది. ఫిబ్రవరి 28న అమెరికా పర్యటనకు వెళ్లిన జెలెన్ స్కీ, ట్రంప్‌తో ‘‘ఖనిజ ఒప్పందం’’పై చర్చించారు. వీరిద్దరి మధ్య మీడియా లైవ్‌లోనే వాగ్వాదం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ట్రంప్ బృందం జెలెన్ స్కీ పై మాత్రమే కాకుండా, ఉక్రెయిన్లపై వ్యక్తిగత దాడిగా అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 29 శాతం మంది అతడిని నమ్మడం లేదని చెప్పారు.