US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
- చివరి దశలో అమెరికా-ఇరాన్ ఒప్పందం..
- ట్రంప్ ప్రకటనను ఖండించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran agreement: ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం దాదాపుగా పూర్తయిందని చెప్పారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి త్వరలో తెరుచుకుంటుందని తెలిపారు. అమెరికా, ఇరాన్, ఇతర దేశాల మధ్య ఒప్పందం దాదాపుగా పూర్తయిందని, చివరి దశ చర్చలు మాత్రమే మిగిలి ఉన్నాయని తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. మధ్యప్రాచ్యంలోని కీలక నేతలతో చర్చలు జరిగాయని ఆయన అన్నారు.
Read Also: Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
Also Read
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, పాకిస్తాన్ సైనిక అధిపతి అసిమ్ మునీర్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాలతో పాటు ఇతరులతో తాను ఓవల్ ఆఫీస్ నుండి చర్చలు జరిపినట్లు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో తాను విడిగా మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు.
అయితే, ట్రంప్ చేస్తున్న వాదనల్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హార్ముజ్ జలసంధి పూర్తిగా తిరిగి తెరుచుకుంటుందనే ట్రంప్ వ్యాఖ్యలకు.. ఈ జలమార్గం తమ ఆధీనంలోనే ఉంటుందని ఇరాన్ చెప్పింది. ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని చెప్పింది. ఏ ఒప్పందమైన హార్ముజ్ జలసంధి కంట్రోల్ తమ చేతుల్లోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ యుద్ధం ముగిసేందుకు గానూ ఒక అవగాహన ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇరాన్ చెప్పింది. ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం తమకు అప్పగించాలని అమెరికా కోరుతుంటే, ఇచ్చేది లేదని ఇరాన్ చెబుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
తాజావార్తలు
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..