Trump: హార్ముజ్ నుంచి నౌకలు బయల్దేరాయి.. ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్
- ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్
- హార్ముజ్ నుంచి నౌకలు బయలుదేరాయని ప్రకటన
- తీరనున్న చమురు, గ్యాస్ కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గమైన హార్ముజ్ జలసంధి ద్వారా సాధారణ నౌకాయానం పునరుద్ధరించబడుతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ స్పందిస్తూ.. చమురుతో నిండిన నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి సురక్షితంగా ప్రయాణం ప్రారంభించాయని పేర్కొన్నారు.

Also Read
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
“చమురుతో నిండిన నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి బయటకు కదలడం ప్రారంభించాయి. అవి దక్షిణ మార్గం (సదర్న్ హైవే) ద్వారా ప్రయాణిస్తున్నాయి. ఆ మార్గం పూర్తిగా సురక్షితమైనది, భద్రమైనది. ఇతర ప్రయాణ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి” అని పేర్కొన్నారు.
టోల్ ఫీజులు ఉండవు: జేడీ వాన్స్
ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా హార్ముజ్ జలసంధి అంశంపై స్పందించారు. భవిష్యత్తులో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఎలాంటి టోల్ ఫీజులు విధించదని అమెరికా ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధిని దీర్ఘకాలికంగా టోల్ రహితంగా తెరిచి ఉంచడమే తమ లక్ష్యమని చెప్పారు. “హార్ముజ్ జలసంధి దీర్ఘకాలికంగా టోల్ ఫ్రీగా అందుబాటులో ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ అంశాన్ని సాంకేతిక స్థాయి చర్చల్లో మరింత స్పష్టంగా ఖరారు చేస్తాం” అని వాన్స్ పేర్కొన్నారు.
మార్కెట్లకు ఊరట
హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం గుండా వెళ్తుంది. ఇటీవల అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు నెలకొనగా.. ఇప్పుడు నౌకాయానం పునరుద్ధరణపై వస్తున్న సంకేతాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరటనిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. తాజా పరిణామాలు చర్చలు తుది దశకు చేరుకున్నాయని సూచిస్తున్నాయి.
- Tags
- Hormuz
- Peace Deal
- trump
- US Iran
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!