Site icon NTV Telugu

H-1B Visa Fee: ట్రంప్ H-1B చర్యలు భారత్ కన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం, ఎలాగంటే.?

Trump

Trump

H-1B Visa Fee: అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, గత వారం H-1B వీసాలపై – $100,000(రూ. 88 లక్షలు) రుసుము విధించాలనే నిర్ణయంతో ఒక్కసారిగా భారతీయ టెక్కీలు ఉలిక్కిపడ్డారు. తమ అమెరికన్ డ్రీమ్స్‌కు ట్రంప్ చెక్ పెట్టారని భావించారు. కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాలోకి ఎంట్రీ లభించదనే భయంతో చాలా మంది విదేశీ వర్కర్లు, ముఖ్యంగా భారతీయులు ఆందోళన చెందారు. అమెరికన్ టెక్ కంపెనీలు తమ H-1B వీసాలు కలిగిన ఉద్యోగులు అమెరికా విడిచి వెళ్లొద్దని, అలాగే అమెరికా వెలుపల ఉన్న వారు వెంటనే వచ్చేయాలని చెప్పాయి.

ఇంటా, బయట నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తన నిర్ణయాన్ని సవరించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రుసుం ఒకేసారి కట్టాలని, ఇది కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌజ్ వివరణ ఇచ్చింది. ట్రంప్ చర్య అమెరికా ఆర్థిక వ్యవస్థనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అమెరికా టెక్ సంస్థలు విదేశాల నుండి, ముఖ్యంగా భారతదేశం నుండి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కోడర్‌లను నియమించుకోవడానికి H-1B, ఇలాంటి వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయని నిపుణులు ఎత్తి చూపారు.

Read Also: Special Focus on Rains: ఆరంభంలో ముఖం చాటేశాడు.. ఇప్పుడు వద్దంటున్నా కుమ్మేస్తున్నాడు

వీసాలను ఖఠినతరం చేస్తే, కంపెనీలు విదేశీ ప్రతిభను ఆకర్షించడం కష్టతరం అవుతుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ బెరెన్‌బర్గ్‌లో ఆర్థికవేత్త అయిన అటకాన్ బాకిస్కాన్ ది గార్డియన్‌తో మాట్లాడుతూ అన్నారు. ట్రంప్ చర్య అమెరికా ‘‘వృద్ధి వ్యతిరేక విధాన రూపకల్పన’’గా అభివర్ణించారు. బరెన్ బర్గ్ ఇటీవల అమెరికా వృద్ధిని 2 శాతం నుంచి 1.5 శాతానికి అంచనాలనున తగ్గించింది. ట్రంప్ తన వలస వ్యతిరేక విధానాలను మార్చుకోకుంటే మరింత ప్రభావం పడుతుందని బకిస్కాన్ హెచ్చరించారు. బ్రోకర్ XTB పరిశోధన డైరెక్టర్ కాథ్లీన్ బ్రూక్స్ మాట్లాడుతూ, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఆపిల్, గూగుల్ వంటి సంస్థలు H-1B వీసాలపై అత్యధిక విదేశీ వర్కర్లను నియమించుకున్నట్లు కొన్ని సంస్థలు తెలిపారు.

H-1B వీసాలలో ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో పనిచేస్తున్నారు. ఈ వీసాల్లో 70 శాతం భారతీయులే. టెక్ కంపెనీలతో పాటు వైద్య రంగంలో భారతీయులు కీలకంగా ఉన్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల మొదట్లో ఇండియా షాక్ అనుభవించవచ్చు, కానీ అమెరికాతో పోలిస్తే తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version