Site icon NTV Telugu

US: అత్యంత శక్తివంతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థను పరిచయం చేసిన ట్రంప్

Goldendome

Goldendome

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థకు సంబంధించిన ‘‘గోల్డెన్ డోమ్’’ వ్యవస్థను ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో తాను హామీ ఇచ్చినట్లుగా అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని అమెరికా ప్రజలకు అందించబోతున్నట్లు తెలిపారు. చెప్పినట్లుగానే శక్తివంతమైన రక్షణ వ్వవస్థను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అత్యాధునిక వ్యవస్థ కోసం అధికారికంగా ఆర్కిటెక్చర్‌ను ఎంచుకున్నట్లు ప్రకటించడానికి సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. బాలిస్టిక్, క్రూయజ్ క్షిపణులను గోల్డెన్ డోమ్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని.. భవిష్యత్‌లో ఎదురయ్యే ఎలాంటి వైమానిక ముప్పునైనా తిప్పికొట్టగలదని పేర్కొన్నారు. దాదాపు దీని కోసం 175 బిలియన్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ గోల్డెన్ డోమ్ ట్రంప్ పదవీ కాలం ముగిసే సమయానికి అందుబాటులోకి రానుంది.

గోల్డెన్ డోమ్..
గోల్డెన్ డోమ్ అనేది భూమి, అంతరిక్ష క్షిపణి వ్యవస్థ. ఇది క్షిపణులను బహుళ దశల్లో ఉండగానే గుర్తించి.. ట్రాక్ చేసి ఆపుతుంది. టేకాఫ్‌కు ముందు లేదా గాల్లో గుర్తించి నాశనం చేస్తుంది. ఈ కొత్త వ్యవస్థ యునైటెడ్ స్టేట్‌ విజయానికి.. మనుగడకు చాలా ముఖ్యమైందిగా ట్రంప్ పేర్కొన్నారు. పూర్తిగా నిర్మించిన తర్వాత ప్రపంచంలో ఎటువైపు నుంచి క్షిపణులు వచ్చినా అడ్డగించగల సామర్థ్యం ఉంటుందని ట్రంప్ తెలిపారు.

ఇది కూడా చదవండి: MS Dhoni: యువ క్రికెటర్లకు ఎంఎస్ ధోనీ క్లాస్.. ఒత్తిడికి గురికావొద్దని వెల్లడి

పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ.. గోల్డెన్ డోమ్ డిజైన్ ఇప్పటికే ఉన్న భూ-ఆధారిత రక్షణ సామర్థ్యాలతో అనుసంధానించబడుతుందన్నారు. క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల, హైపర్‌సోనిక్ క్షిపణులు, డ్రోన్‌లు, అణు దాడుల నుంచి గోల్డెన్ డోమ్ రక్షించగలదని చెప్పారు. మాతృభూమిని రక్షించడానికి ఇంత శక్తివంతమైన గోల్డెన్ డోమ్‌ను రూపొందిస్తు్న్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: US: రష్యాకు అమెరికా వార్నింగ్.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు జరపకపోతే…!

ఈ గోల్గెన్ డోమ్ పూర్తి కావడానికి మూడేళ్లు పడుతుంది. అంటే ట్రంప్ పదవీ కాలం ముగిసే సమయానికి పూర్తవుతుంది. మూడేళ్ల తర్వాత ఈ వ్యవస్థ పని చేయడం ప్రారంభిస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్టీన్ నాయకత్వం వహిస్తారు. గుట్లీన్ 2021లో అంతరిక్ష దళంలో చేరడానికి ముందు వైమానిక దళంలో 30 ఏళ్లు పని చేసిన అనుభవం ఉంది. క్షిపణి రక్షణ, అంతరిక్ష వ్యవస్థల్లో ప్రత్యేక అనుభవం కలిగి ఉన్నారు. ఇక గోల్డెన్ డోమ్ పేరు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నుంచి వచ్చిందే. ఐరన్ డోమ్.. అనేక క్షిపణులను తిప్పికొట్టింది. రష్యా, చైనా నుంచి ఎదురవుతున్నా ముప్పును దృష్టిలో పెట్టుకుని అమెరికా ఈ గోల్డెన్ డోమ్‌ వ్యవస్థను రూపొందిస్తోంది.

చైనా, రష్యా ఆందోళన..
ఇప్పటికే ఇజ్రాయెల్.. ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి.

 

Exit mobile version