అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడు పెంచారు. రెండో విడత పాలనలో ట్రంప్ చర్యలు మరింత స్పీడ్‌గా కనిపిస్తున్నాయి. ఇక ముందుగా చెప్పినట్లుగానే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే పనిని మొదలుపెట్టారు. తాజాగా రెండు వేల మంది ‘యూఎస్ ఎయిడ్’ ఉద్యోగులపై వేటు వేశారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొద్ది మందిని మినహాయించి మిగిలిన వారికి బలవంతపు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాతే ఉద్యోగులపై వేటు పడింది. తొలగింపు నిలిపివేయాలంటూ ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు తిరస్కరించింది. యూఎస్ ఎయిడ్ ద్వారానే ప్రపంచంలోని పలు దేశాలకు సాయం అందుతుంది.
ఇది కూడా చదవండి: Mahakumbh Mela 2025 : కుంభమేళా గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు 13 మందిపై ఎఫ్ఐఆర్