Site icon NTV Telugu

Trump: సుంకాలపై ట్రంప్ పక్షపాతం.. చైనాకు ఏం చేశారంటే..!

Trump

Trump

రష్యాతో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు భారీ జరిమానాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే భారత్‌పై అదనంగా 25 శాతం సుంకం విధించారు. ఇదే కోవలో చైనా కూడా ఉంది. రష్యా దగ్గర చైనా కూడా చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనా విషయంలో మాత్రం పక్షపాతం చూపించారు. చైనాకు విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపినట్లు కథనం వెలువడింది.

పరస్పర సుంకాలపై గత నెలలో స్టాక్‌హోమ్‌లో అమెరికా-చైనా అధికారుల మధ్య వాణిజ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో చైనాపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేసినట్లు నివేదికలు అందుతున్నాయి.

ఇది కూడా చదవండి: Bilawal Bhutto: సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే భారత్ తో యుద్ధమే..

అయితే చైనాతో అమెరికా మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు విధించిన సుంకాల విషయంలో అగ్ర రాజ్యం వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇక ఇదే విషయంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ మాట్లాడుతూ.. చైనాపై ప్రతీకార సుంకాలు విధించాలా? వద్దా? అన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. సుంకాల విషయంలో చైనా సమస్య కొంచెం సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలుతో ముడి పెట్టలేని అనేక ఇతర అంశాలు అమెరికా-చైనా సంబంధాలను ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌కు విధించినట్టుగా చైనాకు కూడా జరిమానా విధిస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు జేడీవాన్స్ పైవిధంగా స్పందించారు.

ఇది కూడా చదవండి: Sridevi : ‘కోర్టు’ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి..! వీడియో వైరల్

తొలుత భారతదేశంపై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానా కింద అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తు్న్నట్లు బాంబ్ పేల్చారు. ఇప్పుడు భారత్ 50 శాతం సుంకం చెల్లించాల్సి వస్తుంది. కొత్తగా విధించింది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. అయితే భారత్ కొనుగోలు చేస్తున్నట్లుగా చైనా కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనాకు మాత్రం జరిమానా విధించలేదు. దీంతో ఇదేం పక్షపాతం అంటూ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version