NTV Telugu Site icon

Trump-Elon Musk: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. మస్క్‌కు కీలక పోస్ట్ అప్పగింత

Trumpelon Musk

Trumpelon Musk

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలోన్‌ మస్క్‌ చేతికి అప్పగించారు. రెండో దఫా పరిపాలనలో మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెడరల్‌ వర్క్‌ ఫోర్స్‌ను మరింతగా కుదించేందుకు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్య శాఖకు అధికారాలు కల్పించారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఓవల్ కార్యాలయంలో టెక్ బిలియనీర్ ఎలోన్‌ మస్క్‌తో పాటు అతని నాలుగేళ్ల కుమారుని సమక్షంలో సంతకాల కార్యక్రమం జరిగింది.

ఇది కూడా చదవండి: Harish Rao: 12 రోజులు గడస్తున్నా.. ఇంకా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు!

వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులతో సంప్రదింపులు జరపాలని, పెద్ద ఎత్తున ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన స్థానాలలోని సిబ్బందిని మాత్రమే పరిమితం చేయాలని దానిలో ఉత్తర్వుల్లో ఆదేశించారు. సంతకం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. డోజ్‌ పని తీరును ప్రశంసించారు. ఇది చట్టం పరిధిలో పనిచేస్తుందా లేదా అనే విషయంలో పలు విమర్శలు ఉన్నప్పటికీ టెస్లా సీఈవో మస్క్‌ ప్రభుత్వానికి సంబంధించిన మరిన్ని పనులు చేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. దేశాభివృద్ధికి బాధ్యత వహించే వ్యక్తి , తనకు అన్ని విషయాలు నివేదించే వ్యక్తి ఈ పని చేసేందుకు సమర్థులని భావిస్తున్నానని తెలిపారు.