Site icon NTV Telugu

Trump: ఆమె ప్రవర్తన దారుణంగా ఉంది.. ఇమ్మిగ్రేషన్ అధికారిని సమర్థించిన ట్రంప్

Trump1

Trump1

అమెరికాలో బుధవారం దారుణం జరిగింది. మిన్నియాపాలిస్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారి జరిపిన కాల్పుల్లో 37 ఏళ్ల రెనీ నికోల్ గుడ్ ప్రాణాలు కోల్పోయింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేస్తుండగా జరిపిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ట్రంప్..
తాజాగా ఇదే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆమె చాలా దారుణంగా ప్రవర్తించిందని తెలిపారు. ఆమె ప్రవర్తన కారణంగానే ఇమ్మిగ్రేషన్ అధికారి కాల్చి చంపినట్లుగా తెలిపారు. మహిళ కారుతో మీదకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా అధికారులు వాహనం కాల్పులు జరిపారని వెనకేసుకొచ్చారు. ఆత్మ రక్షణ కోసమే ఇమ్మిగ్రేషన్ అధికారి కాల్పులు జరిపినట్లుగా సమర్థించారు. ఈ సందర్భంగా కాల్పుల వీడియోను ప్లే చేశారు. అనంతరం అయినా కూడా ఇలా జరగడం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.

జేడీ వాన్స్..
ఇక ఇమ్మిగ్రేషన్ అధికారికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మద్దతు తెలిపారు. ఆమె వామపక్షవాదిగా అభివర్ణించారు. ఆత్మ రక్షణ కోసం ఇమ్మిగ్రేషన్ అధికారి కాల్పులు జరిపినట్లు చెప్పారు. అధికారిని ఢీకొట్టే ప్రయత్నం చేస్తుండగా కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే రెనీ నికోల్ గుడ్ మరణం తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఏసీఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా అంతటా పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించారు. దాదాపు 1,500 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు.

 

Exit mobile version