Site icon NTV Telugu

Donlad Trump: ‘‘ ఆమె పెదాలు మెషిన్‌గన్‌లా కదులుతాయి..’’ కరోలిన్ లెవిట్‌పై ట్రంప్ సె*క్సీ కామెంట్స్..

Trump On Karoline Leavitt

Trump On Karoline Leavitt

Donlad Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె అందం గురించి ప్రశంసలు కురిపించడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. లెవిట్ ముఖం, పెదవులపై ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ఆమె ఒక స్టార్ అయింది’’ అని ఇటీవల ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘ఆమె ముఖం, మెదడు, పెదవులు అవి కదిలే విధానం, అవి ఆమె మెషిన్ గన్‌లా కదులుతాయి’’ అని అన్నారు.

‘‘ఆమె ఒక స్టార్. నిజానికి ఆమె గొప్ప వ్యక్తి. కరోలిన్ కంటే మంచి ప్రెస్ సెక్రటరీ ఎవరికీ లేదని నేను అనుకుంటున్నాను. ఆమె అద్భుతంగా ఉంది’’ అంటూ ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్రంప్ క్లిప్ క్షణాల్లో వైరల్‌గా మారింది. పలువరు నెటిజన్లు ట్రంప్ తీరుపై మండిపడ్డారు.

Read Also: Donald Trump: భారత్-పాక్ మధ్య “కాల్పుల విరమణ”కు నేనే కారణం.. ట్రంప్ నోట అదే మాట..

ఒక యూజర్ ‘‘బిగ్ మోనికా లెవిన్స్కీ వైట్స్’’ అని వ్యాఖ్యానించారు. ఇది మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, అప్పటి వైట్ హౌజ్ ఇంటర్న్ మోనికా లెవిన్స్కీ మధ్య 1990లో జరిగిన స్కాండల్‌ని గుర్తు చేస్తుందని అన్నారు. మరొకరు ‘‘ఇలాంటి మాటలు ట్రంప్ పేజెంట్లలో మైనర్లను ఆకర్షించేందుకు వాడేవాడనేది నన్ను ఆశ్చర్యపరచదు’’అని ట్వీట్ చేశారు. వివాదాస్పద ‘‘ఎప్ట్సీన్ కేసు’’లో అతడిపై ఉన్న అనుమానాలు మరింత బలపరుస్తాయని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించారు.

27 ఏళ్ల కరోలిన్ లెవిట్ ట్రంప్ ఐదో ప్రెస్ సెక్రటరీ. ఆయన రెండోసారి పదవి చేపట్టిన తర్వాత మొదటి ప్రెస్ సెక్రటరీగా నియమితులయ్యారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్ సందర్భంగా లీవిట్ ట్రంప్‌ని ప్రశంసిస్తూ, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అన్నారు. ట్రంప్ ఆరు నెలల పదవీ కాలంలో నెలకు ఒక శాంతి ఒప్పందాన్ని, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించారని చెప్పింది.

Exit mobile version