Site icon NTV Telugu

Donald Trump: భారత్‌పై సుంకం అంత తేలికైన పని కాదు, సంబంధాలు దెబ్బతిన్నాయి..

Trump

Trump

Donald Trump: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అంగీకరించారు. ‘‘భారతదేశం రష్యాకు అతిపెద్ద కస్టమర్. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల నేను 50 శాతం సుంకం విధించాను. అది చేయడం తేలికైన విషయం కాదు.’’ అని ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

Read Also: Sushila Karki: నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కీ ప్రమాణస్వీకారం..

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ పరోక్షంగా ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యాకు నిధులు సమకూరుస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దీంతో ట్రంప్ సర్కార్ 50 శాతం సుంకాలు విధించినట్లు సమర్థించుకుంటోంది. అయితే, ఈ నిర్ణయంపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘‘సుంకాలు విధించడం అతిపెద్ద విషయమని, అది భారత్‌తో అమెరికా సంబంధాల్లో చీలికకు కారణమైంది’’ అని ట్రంప్ అన్నారు.

ట్రంప్ వాణిజ్య యుద్ధం కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లోని విస్తారమైన పాడి, వ్యవసాయ పరిశ్రమల్లోకి అమెరికా కంపెనీలు రావడాన్ని వ్యతిరేకించినందుకు రెండు దేశాల మధ్య వాణిజ్య ప్రతిష్టంభన ఏర్పడింది. దీని తర్వాత, ట్రంప్ రష్యా ఆయిల్‌ని సాకుగా చూపుతూ ప్రపంచంలో అత్యధికంగా భారత్‌పై టారిఫ్స్ విధించారు.

Exit mobile version