Site icon NTV Telugu

Donald Trump: ట్రంప్‌ కార్యవర్గంలోకి మరో ఇండియన్.. హెల్త్‌ డైరెక్టర్‌గా జై భట్టాచార్య

Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కు తదుపరి డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను ఎంపిక చేశారు. ఈ మేరకు ట్రంప్‌ ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

Read Also: Cyclone Fengal: ఫెంగల్‌ తుఫాన్‌ ఎఫెక్ట్.. తమిళనాడు, పుదుచ్చేరిలకు రెడ్‌ అలర్ట్‌

కాగా, జై భట్టాచార్యను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ డైరెక్టర్‌గా నియమించడం చాలా ఆనందంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రాబర్డ్‌ ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌ సహకారంతో భట్టాచార్య ఎన్‌ఐహెచ్‌ను నడిపించడంతో పాటు దేశ ప్రజల ప్రాణాలను కాపాడే ముఖ్యమైన ఆవిష్కరణలు చేసేందుకు పని చేయనున్నారని చెప్పుకొచ్చారు. యూఎస్ ను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు వారిద్దరూ కృషి చేస్తారని ట్రంప్ వెల్లడించారు. ఇక, డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటనపై జై భట్టాచార్య సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌ నన్ను తదుపరి ఎన్‌ఐహెచ్‌ డైరెక్టర్‌గా నియమించారని పేర్కొన్నారు. మేము అమెరికన్ శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా తీర్చిదిద్దుతామన్నారు.

Exit mobile version