Site icon NTV Telugu

New Visa Rules: అమెరికా వెళ్లే వారికి ట్రంప్‌ మరో కొత్త రూల్.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నో వీసా!

Visa

Visa

New Visa Rules: అమెరికాలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కొత్త రూల్ అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. డయాబెటిస్‌, ఒబెసిటీ, టీబీ లాంటి అంటు వ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్‌ చేసేందుకు నిబంధనలను రూపొందించారు. మరి కొన్ని వ్యాధులను ఈ లిస్టులో చేరుస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అంటే, ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్‌ హిస్టరీపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడే అవకాశం ఉందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అలాగే, ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే ఛాన్స్ ఉన్న దరఖాస్తుదారులను యూఎస్ లోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా రూల్స్ కఠినతరం చేసినట్లు తెలుస్తుంది.

Read Also: Banakacherla Project: ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం..! బనకచర్ల ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ టెండర్లు రద్దు..

అయితే, వీసాకు అప్లై చేసే దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని ట్రంప్ సూచించారు. హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.. కాబట్టి, ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్యం అవసరం.. ఆర్థికంగా కూడా దేశానికి భారం అవుతారు.. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడుతారో లేదో గుర్తించాలని చెప్పారు. ఒకవేళ అలాంటి వారైతే యూఎస్ లోకి రాకుండా అడ్డుకునేలా మార్గదర్శకాలను అమెరికా సర్కార్ నిబంధనలు తీసుకొచ్చింది.

Exit mobile version