Korean conflict: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం కొనసాగుతుంది. అలాంటిది ఇరు దేశాల సరిహద్దులో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, గత కొద్దికాలంగా ఇరు దేశాల మధ్య ‘చెత్త బెలూన్ల’ ఘర్షణ కొనసాగుతుంది. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ సర్కార్ వదిలిన చెత్త బెలూన్ ఏకంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని అధ్యక్ష కార్యాలయ ప్రాంగణంలో పడిందని అధికారులు తెలిపారు. సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్, ఆయన సతీమణిని అపహాస్యం చేసేలా అందులో కరపత్రాలు ఉన్నాయని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది.
Read Also: BJP Candidate List: యూపీ ఉపఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ
ఇక, గతంలో కూడా దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపై ఉత్తర కొరియా వ్యర్థాలతో కూడిన బెలూన్లు జార విడిచింది. వాటి వల్ల ఏలాంటి ప్రమాదం సంభవించనప్పటికి.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ఆ చెత్తను అక్కడి నుంచి తొలగించారు. ఈ వరుస ఘటనలతో సౌత్ కొరియా తీవ్ర స్థాయిలో నార్త్ కొరియా అధనేత కిమ్ జోంగ్ ఉన్ పై మండిపడింది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.