Jeffrey Epstein Files: జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణంలో ప్రముఖుల పేర్లు వస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్తలు హైలెట్ అవుతున్నాయి. యుక్త వయసులోని బాలికకు డబ్బు ఎరవేసి సెక్స్ ట్రాఫికింగ్ నిర్వహించినట్లు జెఫ్రీ ఎప్‌స్టీన్, అతని సహచరుడు మాక్స్ వెల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2002-2005 మధ్య ఎప్‌స్టీన్ ఫ్లోరిడాలోని తన ఇంటికి ఇలా యువతులను ఆహ్వానించి వారిపై లైంగిక దోపిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే 2019లో ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎప్‌స్టీన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో మరో నిందితుడు ఘిస్లైన్ మాక్స్ వేల్‌పై విచారణ కొనసాగుతోంది. మాక్స్ వెల్ అతనికి అమ్మాయిలను సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ యూఎస్ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌తో పాటు బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే ప్రముఖ మోడల్ ఎప్‌స్టీన్ ఐలాండ్‌కి వెళ్లొచ్చిన తర్వాత రెండేళ్లకు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో రహస్య పత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రష్యా మోడల్ రుస్లావా కోర్షునోవా 2008లో న్యూయార్క్‌లోని విలాసవంతమైన భవనం 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి రెండేళ్ల ముందు ఆమె వర్జిన్ ఐలాండ్స్ లోని ప్రైవేట్ ఐలాండ్‌కి, ఎప్ స్టీన్ కి చెందిన ‘లోలితా ఎక్స్‌ప్రెస్’ అనే విమానంలో అతడితో పాటు వెళ్లింది.
Read Also: Sajjala Ramakrishna Reddy: షర్మిల కాంగ్రెస్లో చేరిక వెనుక అతని కుట్ర ఉంది..
కోర్షునోవా పలు బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించారు. ఎప్‌స్టీన్‌తో విమానంలో వెళ్లే సమయానికి కోర్షునోవాకు కేవలం 18 ఏళ్లు మాత్రమే అని ఫైట్ లాగ్ బుక్ వివరాల్లో వెళ్లడైంది. ఎప్‌స్టీన్ అరెస్ట్ కావడానికి కొన్ని రోజుల ముందే వారిద్దరు కలిసి వెళ్లారు. జూన్ 7, 2006న వీరిద్దరు కలిసి వెళ్లారు. విమానంలో ఎప్‌స్టీన్ కోర్షునోవాతో పాటు అతని బాడీ గార్డ్, వ్యక్తిగత షెఫ్, సహాయకుడు ఉన్నాడు. మాజీ యూఎఫ్సీ ఫైటర్ స్టెఫానీ టిడ్వెల్ అనే మహిళ కూడా విమానంలో ఉన్నారు. అయితే వారు ఐలాండ్ వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేది తెలియరాలేదు.
చనిపోయే సమయానికి రుస్లావా కోర్షునోవాకు 20 ఏళ్లు. ఈమె అందానికి చాలా మంది రష్యన్లు ఫిదా అయ్యారు. ‘‘ ది రష్యన్ రాపుంజెల్’’ అని పిలిచే వారు. ఆమె చనిపోయే ముందు చాలా బరువు తగ్గిందని ఆమె మాజీ ప్రేమికుడు వెల్లడించారు. లవ్‌లో సమస్యలు, కుటుంబాన్ని మిస్ అవుతున్నా అని వాపోయేదని ఆమె మరణించిన తర్వాత పలు కథనాలు వచ్చాయి.