ఇటీవలే పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లోని అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలైన దృశ్యాలను నాసా శాటిలైట్ ద్వారా చిత్రీకరించింది. టోంగా దీవుల్లో బద్దలైన ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన శక్తి హిరోషిమా అణుబాంబు శక్తి కంటే 200 రెట్లు అధికంగా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అగ్నిపర్వతం బద్దలైనపుడు వెలువడిన బూడిద సుమారు 40 కిలో మీటర్ల మేర వ్యాపించిందని, పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, కాలువలు, చెరువులు, నదులు బూడిదతో నిండిపోయిందని నాసా తెలియజేసింది.
Read: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇకపై పాఠశాలల్లో అవి రద్దు
రెండు గ్రామాలు పూర్తిగా బూడిదతో కప్పబడినట్టు నాసా దృవీకరించింది. నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని నాసా పేర్కొన్నది. ఈ విషపూరితమైన బూడిద కారణంగా అక్కడి ప్రజలు ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనేక దేశాలు ముందుకు వచ్చి టోంగా ప్రజలను ఆదుకుంటున్నారని నాసా పేర్కొన్నది.
