NTV Telugu Site icon

Tomatoes grown in space: అంతరిక్షంలో పండించిన టొమాటో… భూమికి తీసుకువస్తున్న డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్

Tomatoes From Space

Tomatoes From Space

Tomatoes grown in space: అంతరిక్షం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. మనం ఇప్పటి వరకు అంతరిక్షం గురించి, విశ్వం గురించి తెలుసుకుంది చాలా తక్కువ మాత్రమే. అంతరిక్షంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భూమి నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ పూర్తిగా శూన్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటుంది. ఈ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములు కొన్ని నెలల పాటు ఉంటూ పలు పరిశోధనలు చేస్తుంటారు.

Read Also: Madhya Pradesh: కరోనాతో చనిపోయినట్లు ప్రకటించబడిన వ్యక్తి.. రెండేళ్ల తర్వాత సజీవంగా ఇంటికి..

తాజాగా ఇలా పరిశోధనల్లో భాగంగా పండించిన టొమాటోలను భూమి మీదకు తీసుకురాబోతున్నారు శాస్త్రవేత్తలు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమి పైకి రాబోతున్నాయి. ఐఎస్ఎస్ నుంచి ఈ రోజు(ఏప్రిల్ 15) స్పేస్ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్రూ ద్వారా దాదాపుగా 2,000 కిలోల సామాగ్రి, సైంటిఫిక్ ప్రయోగాలకు సంబంధించిన వస్తువులను మోసుకొస్తోంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8.15కి ఐఎస్ఎస్ నుంచి ఈ స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరుతుంది.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో ప్రత్యేకమైన గ్రీన్ హౌజ్ మాడ్యూల్ లో వ్యోమగాములు ఈ టొమాటోలను పండించ,ారు. మరగుజ్జు రకం టొమాటోలను పెంచినట్లు నాసా ఒక బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. 90, 97, 104 రోజుల పాటు మూడు టొమాటో పంటు అంతరిక్షంలో పండించారు. వీటి పోషక విలువలను పరిశీలించారు. తాజా ఆహారం కోసం అంతరిక్షంలో మొక్కలను పెంచే సామర్థ్యం, ఐఎస్ఎస్ లో చాలా కాలంపాటు పనిచేసే వ్యోమగాముల మెరుగైన జీవితం కోసం నాసా ఈ ప్రయోగాన్ని చేసినట్లు తెలిపింది. టొమాటోలతో పాటు జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జేఏఎక్స్ఏ) అంతరిక్షంలో రూపొందించిన స్పటికాలను భూమికిపైకి రాబోతున్నాయి. ఈ క్రిస్టల్స్ తయారు చేసే విధానం భవిష్యత్తులో మరింత సామర్థ్యంతో ఉన్న సోలార్ సెల్స్, సెమీకండక్టర్ల తయారీకి ఉపయోగపడనున్నాయి.

Show comments