Low Fertility Rate: చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ‘‘తక్కువ సంతానోత్పత్తి’’ ఇబ్బందులు పడుతున్నాయి. ఈ దేశ ప్రజలు వివాహాలకు , పిల్లలు కనడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఇటీవల కాలంలో తక్కువ జననాలు నమోదవుతుండటం ఆ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జపాన్‌లో సంతానోత్పత్తి రేటు చాలా ఏళ్ల తర్వాత జూన్ నెలలో రికార్డ్ స్థాయిలో తగ్గిపోయింది. ‘‘కరోషి’’ కారణంగా తక్కువ జననాలు నమోదవుతున్నాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కరోషి అంటే వృత్తిపరమైన ఒత్తిడి, వైకల్యం లేదా పని కారణంగా మరణాన్ని సూచించే జపనీస్ పదం.
Read Also: Atala Mosque Row: “అటాలా మసీదు కాదు, ఆలయం”.. కోర్టుకు చేరిన వివాదం..
ఈ నేపథ్యంలో సంతానోత్పత్తిని పెంచేందుకు జపాన్ వారానికి 4 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో టోక్యోలో ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల పని ఒత్తిడిని తగ్గించడంతో పాటు తక్కుతున్న జనన రేటుని పరిష్కరిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు యువతకు పెళ్లిల్లు చేయడానికి, కుటుంబాలను ఏర్పరచడానికి జపాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
సంతానోత్పత్తి రేటు 1.2కి తగ్గడంతో గతేడాది 7.27 లక్షల మంది పిల్లలు మాత్రమే జన్మించినట్లు ఆ దేశ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. జనాభా స్థిరపడాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాగే క్షీణిస్తే 2008లో ఉన్న 128 మిలియన్ల జనాభా నుండి 2060 నాటికి 86.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం, జపాన్ యొక్క పని సంస్కృతి మరియు జీవన వ్యయం జననాల రేటు పడిపోవడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.