Site icon NTV Telugu

World Tigers Day: నేడు ప్రపంచ పులుల దినోత్సవం.. పూరీ తీరంలో 15 అడుగుల సైకత చిత్రం

World Tigers Day

World Tigers Day

World Tigers Day: ఒక్కో రోజుకు ఒక్కో దినోత్సవంతో వేడుకలను చేస్తున్నారు. అందులో బాగంగా నేడు ప్రపంచ పులుల దినోత్సవం. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా పులులను రక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ పర్యావర్ణ వేత్తలు చెబుతున్నారు. సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా ఇసుకతో చిత్రాలను రూపొందిస్తూ అందరినీ ఆలోచింప చేసే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో 15 అడుగుల ఎత్తున్న పులి బొమ్మను రూపొందించారు. తల్లి పులి తన పిల్లను ప్రేమతో నిమురుతున్నట్లుగా ఈ చిత్రాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అడవుల్లో ఉండే తమను రక్షించండి (Save Us to Save the Environment) అంటూ జనారణ్యంలో ఉండే జనాలకు పులులు చెబుతున్నట్లుగా ఈ సైకత శిల్పాన్ని ఆయన చెక్కారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్న పులుల జనాభా క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో పులులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో 2010 నుంచి ప్రతిఏటా జూలై 29ని ప్రపంచ పులులు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

Read also: Business Idea: మహిళలకు అదిరిపోయే బిజినెస్.. ఇంట్లో నుంచి లక్షలు సంపాధించవచ్చు..

ప్రపంచంలో సుమారు 5 వేల పులులు ఉంటే ఒక్క భారత్‌లో 3 వేలకుపైగా ఉండటం విశేషం. అడవి పులులు అత్యధికంగా ఉన్నది కూడా మన దేశంలోనే కావడం గమనార్హం. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో 2006 నుంచి పులుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తున్నది. 2006 ఏడాదిలో 1,411గా ఉన్న పులుల సంఖ్య.. 2010 నాటికి 1,706కు చేరింది. 2014లో 2,226కి చేరగా.. 2019లో 2,967, 2023 వచ్చేసరికి పులుల సంఖ్య 3,167కు పెరిగింది. దేశంలో ప్రతి పదేళ్లకు జనాభా లెక్కిస్తున్నట్టే.. ప్రతి నాలుగేండ్లకు పులుల జనాభాను లెక్కిస్తారు. భారత్‌ తర్వాత రష్యాలో అత్యధికంగా 540 పులులు ఉన్నాయి. ఇండోనేషియాలో 500, నేపాల్‌లో 355, థాయిలాండ్‌లో 189, మలేషియాలో 150 చొప్పున ఉన్నాయి. ఇక మన పొరుగు దేశం చైనాలో 50 మాత్రమే ఉండగా, మయన్మార్‌లో 22, వియత్నాంలో 5, లావోస్‌లో 2 పులులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

Exit mobile version