Site icon NTV Telugu

Mali-India: మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్

Maliindia

Maliindia

పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌నకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు భారతీయ పౌరులు అపహరణకు గురికావడంపై భారతీయ ఎంబసీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్‌నకు గురైన భారతీయులను సురక్షితంగా రక్షించి విడుదల చేయాలని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

ఇది కూడా చదవండి: PM Narendra Modi: ప్రధాని మోడీకి అరుదైన గౌరవం.. ఘనా జాతీయ అత్యున్నత అవార్డు ప్రదానం

పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుస ఉగ్ర దాడులు జరుగుతున్నాయి. అయితే కేస్‌లోని డైమాండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయులు అపహరణకు గురయ్యారు. జూలై 1న సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ఆవరణలో ఉండగా బలవంతంగా దాడి చేసి ముగ్గురిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అయితే ఈ కిడ్నాప్‌లకు బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. మంగళవారం మాలి అంతటా జరిగిన సమన్వయ దాడులకు అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM) బాధ్యత వహించింది. ఈ గ్రూపే ముగ్గుర్ని అపహరించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Off The Record: వైఎస్ జగన్ వరుస పర్యటనలకు కారణం అదేనా..!?

ఇక బమాకోలోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమై.. సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపింది. అలాగే డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వహణ బృందంతో కూడా చర్చలు జరిపింది. మాలి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఎంబసీ సంప్రదింపులు జరుపుతోంది. అలాగే అపహరణకు గురైన భారతీయ పౌరుల కుటుంబ సభ్యులతో కూడా ఎంబసీ సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ తెలిపింది. ఈ కిడ్నాప్‌ను భారత ప్రభుత్వం ఖండిస్తోందని.. త్వరగా విడుదలకు అన్ని చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని కోరినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం మాలిలో నివసిస్తున్న భారతీయులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. భారతీయులకు సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని తెలిపింది.

Exit mobile version