NTV Telugu Site icon

Bangladesh: ఢాకాలో వేలసంఖ్యలో హిందువుల నిరసన.. ప్రభుత్వానికి 8 డిమాండ్లు..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి, ఆమె రాజీనామా చేసి ఇండియాకు పారిపోయి వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆ దేశంలో చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా హిందువుల్ని అక్కడి మతోన్మాదులు టార్గెట్ చేసి దాడులు చేశారు. హిందూ దేవాలయాలు, హిందువుల ఆస్తుల్ని, వారి వ్యాపారాలపై దాడులు చేశారు. పలుచోట్ల హిందూ యువతులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు.

Read Also: Ponnam Prabhakar: కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న కూడా దాడి అవసరమా..?

ఇదిలా ఉంటే, తమకు రక్షణ కల్పించాలని బంగ్లా రాజధాని ఢాకాలో వేలాది హిందువులు నిరసన నిర్వహించారు. హింస నుంచి తమను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంబైన్డ్ మైనారిటీ అలయన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఢాకాలోని ప్రముఖ సెంట్రల్ షాహిద్ మినార్ వద్ద నిరసన తెలిపారు. దేశంలో మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని తాత్కాలిక బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్‌ని కోరారు. ప్రభుత్వం ముందు 8 డిమాండ్లను ఉంచారు.

బంగ్లాదేశ్ హిందువులు, మైనారిటీల డిమాండ్లు:
1. తప్పిపోయిన, మరణించిన, గాయపడిన లేదా ప్రభావితమైన మైనారిటీ సభ్యుల కుటుంబాలకు పరిహారం.
2. మైనారిటీ అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు.
3. మైనారిటీ రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టడం మరియు న్యాయం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు.
4. దుర్గాపూజకు మూడు ప్రభుత్వ సెలవులు ప్రకటించడం.
5. జప్తు చేయబడిన మతపరమైన ఆస్తుల రికవరీ మరియు రక్షణ, ఈ స్థలాలను సంరక్షించడానికి మరియు దేవాలయాలను పునరుద్ధరించడానికి ఒక చట్టంతో.
6. మొత్తం 64 జిల్లాల్లో మోడల్ దేవాలయాల స్థాపన మరియు వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు, హిందూ రిలిజియస్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను పునాదిగా మార్చడం.
7. సంస్కృత మరియు పాళీ విద్యా మండలి ఆధునీకరణ.
8. వార్షిక రథయాత్రకు సెలవు దినంగా ప్రకటించడం.

Show comments