NTV Telugu Site icon

London Nanny: ఈ ఆయా జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే.. ప్రైవేట్ జెట్‌లో టూర్లు.. స్పెషల్‌గా డ్రైవర్ కూడా..

London Nanny

London Nanny

సాధారణంగా పిల్లల సంరక్షణ చూసే ఆయాల జీతం రూ. 20 వేల నుంచి రూ.50 వరకు ఉంటుంది. మరి ప్రొఫెషనల్ అయితే లక్షల్లో ఉంటుంది. అది విదేశాల్లో మాత్రమే.. లేదంటే సెలబ్రేటీల ఇళ్లలో పని చేసే ఆయాలకు రూ. లక్ష వరకు ఉండోచ్చు. కానీ ఈ ఆయా నెల జీతం రెండు కోట్లు అంట. వింటుంటేనా అవాక్కఅవుతున్నారు కదా. ఇక ఆమె లగ్జరీ లైఫ్, సదుపాయలు వింటే నోరెళ్లబెట్టక తప్పదు. ఆమె బయటు వెళ్లాలంటే ప్రత్యేకంగా కారు, డ్రైవర్ కూడా ఉండాల్సిందేనట. అంతేకాదు విదేశాలకు వెళ్లినప్పుడు రిట్జ్ వంటి ఫైవ్ స్టార్ హోటళ్లలో బస, క్రూయిజ్ షిప్‌, ప్రైవేట్ జెట్లో టూర్లు.. ఇలా ఎన్నోన్నో సదుపాయలతో లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది లండన్‌కు చెందిన ఈ ఆయా.

Also Read: Minister Adimulapu: సీఐటీయూతో చర్చలు.. మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం.

వివరాలు.. లండన్‌కు చెందిన సోన్యా కుమార్ (28) ఏ గ్రేడ్ వీఐపీ ఇళ్లలోని పిల్లల సంరక్షురాలిగా పనిచేస్తోంది. ఇందుకోసం ఆమె ఆయా కోర్సుల్లో స్పెషలైజేషన్ కూడా చేసింది. దీంతో ఆమె ప్రోఫెషన్ బట్టి సౌత్ లండన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు, హాలీవుడ్ యాక్టర్స్, హై ప్రోఫైల్ ఫ్యాషన్ డిజైనర్లు వారి పిల్లల సంరక్షురాలిని సోన్యాను ఎంచుకుంటున్నారు. ప్రోఫెషన్ పరంగా సోన్యాకు డిమాండ్ కూడా బాగానే ఉందట. దీంతో ఆమె లండన్‌కు చెందిన ప్రముఖ ఏజేన్సీ‌కి సైన్ వీఐపీ ఇళ్లలో ఆయాగా పనికి చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె నెల జీతం రూ. 2 కోట్ల 11 లక్షల వరకు పొందుట. అప్పుడప్పుడు లగ్జరీ వస్తువులు కానుక కూడా ఇస్తుంటారట.

Sonya Kumar

పైగా తను పని చేసే ఇంట్లోని వారు విదేశి పర్యటనలకు వెళితే వారితో పాటు తనని కూడా తీసుకువెళతారని ఆమె చెప్పింది. వారితో ఆమెకు అన్ని లగ్జరీ సదుపాయాలు ఉంటాయని కూడా చెప్పింది. ఎన్నో సార్లు ఆమె ప్రైవేట్ జెట్‌, క్రూయిజ్ షిప్‌లో ప్రయాణం చేశానని తెలిపింది. బయటకు వెళితే ప్రత్యేకంగా కారు, డ్రైవర్ లగ్జరీ సదుపాయలను పొందుతుంది. ఈ క్రమంలో తను పని చేసే యజమానులతో కలిసి విదేశి పర్యటనలు కూడా చేసిందట. ఇప్పటి వరకు ఆమె ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, యూఏఈ వంటి దేశాలతో పాటు ఐల్లాండ్ వంటి దీవులను కూడా చూట్టోచ్చింద. ఈ మేరకు సోన్యా మాట్లాడుతూ.. 17 ఏళ్ల వయసు నుంచే తాను ఆయాగా పని చేస్తున్నానని చెప్పింది. అప్పుడు తనకు అది చేయడం ఇష్టం లేదని చెప్పిది.

Also Read: Revanth Reddy : 2024-25 బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌

అయితే మొదట తాను ఓ రెస్టారెంట్‌లో జాబ్ చేస్తూ.. పార్ట్‌టైంగా ఆయా జాబ్ చేశానంది. ‘ఇందులోనే లైఫ్ ఉందని అర్థం అయ్యాక.. ఇందులో స్పెషల్ కోర్స్ చేశాను. ఆ తర్వాత ఓ ఎజేన్సీకి ఒప్పందం కుదర్చుకున్నాను. దాంతో A గ్రేడ్ వీఐపీ ఇళ్లలో పని చేస్తూ వచ్చాను. ఈ క్రమంలో వారు నాకు అన్ని లగ్జరీ సదుపాయాలనే ఇచ్చేవారు. ఒక్కోసారి నేను బయటకు వెళ్లాల్సి వస్తే వారి క్రిడిట్ కార్డ్స్ కూడా ఇచ్చారు. అన్ని సదుపాయలతో పాటు 2000 బ్రిటిష్ పౌండ్లు ఇచ్చేవారు. అంతేకాదు లగ్జరీ బహుమతులు కూడా ఇచ్చేవారు. ఇక నాకు ఆహారం కోసం రోజుకు 200 పౌండ్లు కెటాయించేవారు. వారంత తనని వారి ఇంట్లో మనిషిగా చూస్తారంది. ప్రస్తుతం ఈ ఆయా జాబ్‌తో తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఇది దేవుడు దయ అంటూ చెప్పుకొచ్చింది.

London Nanny1

Show comments