NTV Telugu Site icon

Portofino: అందమైన ప్రదేశం.. కానీ సెల్ఫీలు నిషేధం.. అతిక్రమిస్తే..

Portofino Selfies Ban

Portofino Selfies Ban

This Italian Town Could Fine Tourists $300 For Taking Selfies: ఏదైనా ఒక అందమైన ప్రాంతం కనిపిస్తే చాలు.. ఫోటో ప్రియులు వెంటనే అక్కడ ఫోటోలు క్లిక్‌మనిపిస్తారు. తమకున్న ఫోటోగ్రఫీ స్కిల్స్ మొత్తం వాడేసి, రకరకాలుగా ఆ ప్రాంతంలో ఫోటోలు దిగి.. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇక టూరిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఫోటోలు దిగడం కోసమే ఆయా అందమైన ప్రదేశాలను సెలెక్ట్ చేసుకొని మరీ వెళ్తుంటారు. కానీ.. ఇటలీలోని పోర్టోఫినో పట్టణానికి విహారయాత్రకు వెళ్లాలనుకుంటే మాత్రం.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే బెటర్. ఎందుకటే.. అక్కడి సుందరమైన దృశ్యాల వద్ద సెల్ఫీలు గానీ, ఫొటోలు గానీ దిగడం కుదరదు. ఈమేరకు అక్కడ ఫోటోలు దిగడాన్ని నిషేధం విధిస్తూ.. పట్టణం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Vinay Bhaskar: అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభలు

ఇటలీలో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశాలలో పోర్టోఫినో ప్రాంతం ఒకటి. అక్కడి జనాభా కేవలం 500 మంది మాత్రమే. సెలవుల్లో మరీ ముఖ్యంగా.. వేసవి కాలంలో వేలాదిమంది పర్యాటకులు ఆ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. కనులవిందుగా ఉండే అందమైన ప్రదేశం కావడంతో.. అక్కడ సెల్ఫీలు, ఫోటోలు దిగే నెపంతో ఒకే చోట ఎక్కువ మంది జనం గుమిగూడుతున్నారు. దీంతో.. ఈ ప్రాంతమంతా రద్దీగా తయారవుతుంది. దీంతో.. స్థానిక కార్యకలాపాలు కొనసాగించడం ఇబ్బందికరంగా మారింది. ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించిపోతుండటంతో.. గందరగోళ వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే.. ఫోర్టోఫినోలో రద్దీని తగ్గించడం కోసం, అక్కడి అధికారులు కొన్ని నిబంధనలు విధించారు. వాటిల్లో.. ఫోటోలు దిగడాన్ని బ్యాన్ చేసింది. పర్యాటకులు ఎవరూ సెల్ఫీలు దిగకుండా.. నో-వెయిటింగ్‌ జోన్‌‌ను ప్రవేశపెట్టింది.

Singer Sunitha: సింగర్ సునీత భర్తకు ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు

ఒకవేళ ఎవరైనా నిబంధనల్ని అతక్రమించి సెల్పీలు గానీ, ఫోటోలు గానీ తీస్తే.. 275 యూరోల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.25 వేలు) వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈస్టర్‌ వారాంతం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 వరకు వర్తిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు ఈ నియమాలు అమల్లో ఉండనున్నాయి. ఈ వ్యవహారంపై ఫోర్టోఫినో మేయర్ మాటియో వయాకావా మాట్లాడుతూ.. ఫోటోలు దిగేందుకు జనాలు ఒకేచోట గుమిగూడడం వల్ల వీధుల్లో గంటల తరబడి ట్రాపిక్‌ స్తంభించిపోతోంది. దీంతో గందరగోళం నెలకొంటోంది. దానికి పర్యాటకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్న ఆయన.. భద్రతా చర్యల దృష్ట్యా సెల్ఫీలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.

Show comments