మూడు నెలలుగా రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు, గ్రామాలు సర్వనాశనం అవుతున్నాయి. అయినా అటు రష్యా అధినేత పుతిన్, ఇటు ఉక్రెయన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తగ్గడం లేదు. బలమైన రష్యా ముందు కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందనుకున్న ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇస్తున్న సైనిక, వ్యూహాత్మక సహకారంతో రష్యాకు ఎదురొడ్డి నిలుస్తోంది. రాజధాని కీవ్ ను ఆక్రమించుకోవాలని అనుకున్న రష్యాను నిలువరించారు. దీంతో చేసేదేం లేక తూర్పు ప్రాంతం నుంచే ఇప్పుడు రష్యా యుద్ధ చేస్తోంది.
ఇదిలా ఉంటే రష్యాను కట్టడి చేద్ధాం అనుకున్న పాశ్చాత్య దేశాలు మాత్రం ఫెయిల్ అయిన వాతావరణం కనిపిస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని భావించిన అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని.. ఫలితంగా దారిలోకి వస్తుందని భావించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, నాటో దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యాకు ప్రధాన ఆదాయం అయినటు వంటి ఆయిల్, గ్యాస్ దిగుమతులను యూరప్ దేశాలు నిలిపివేసుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే ఇన్ని ఆంక్షల విధించిన రష్యా కరెన్సీ రూబెల్ విలువ డాలర్ తో పెరుగుతూనే ఉంది. మార్చి 7న రికార్డ్ స్థాయిలో ఒక డాలర్ రూబెల్ విలువ 0.007కు పడిపోయింది. అయితే ఆ తరువాత 15 శాతం వరకు మారకపు విలువ మెరుగుపడింది. ప్రస్తుతం ఇది 0.016 పెరిగింది. యుద్ధానికి సన్నద్ధం అవుతున్నప్పుడే రష్యా అధ్యక్షుడు పుతిన్ పకడ్బందీ వ్యూహాన్ని రచించుకున్నాడు. ఎలాగూ పాశ్చత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తాయని పుతిన్ కు తెలిసే చమురు, గ్యాస్ కొనుగోలు చేయాలంటే రూబెల్ లోనే చెల్లించాలని స్పష్టం చేశాడు. అంతకు ముందు ఈ లావాదేవీలన్నీ యూరోల్లో జరిగేవి.
రష్యాతో భారీ స్థాయిలో గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశం జర్మనీ. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ద్వారా రష్యా నుంచి జర్మనీకి గ్యాస్ సరఫరా అవుతుంది. అయితే రష్యా విధించిన రూబెల్ షరతుకు జర్మనీ అంగీకరించింది. అయితే అమెరికాకు భయపడి రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు యూరప్ దేశాలు జంకుతున్నాయి. అయితే రష్యా నుంచి చవకగా వచ్చే చమురును, గ్యాస్ ను కాదనుకుంటే దీర్ఘకాలంలో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రష్యాకు ప్రస్తుతం రూబెల్ రూపంలో చెల్లింపులు జరిగినా..దీర్ఘకాలం ఇదే వ్యూహాన్ని అమలు చేస్తే రష్యా ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.