ఎప్పుడైతే అమెరికా తన బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. అతి తక్కువ సమయంలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఆమెరికా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగనున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలు ఉన్నప్పుడే తాలిబన్లు వివిధ మార్గాల ద్వారా భారీ ఆదాయాన్న సమకూర్చుకున్నారు. ఇప్పుడు అమెరికా దళాలు తప్పుకుంటే తాలిబన్ల ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. తాలిబన్లకు అత్యధికంగా మాదకద్రవ్యాల రవాణా, ఉత్పత్తి నుంచే వస్తున్నది. వీరి ఆదాయంలో సింహభాగం ఈ రకంగానే వస్తున్నది. ప్రపంచంలో నాలుగింట మూడొంతున నల్లమందు ఆఫ్ఘన్ నుంచే ఎగుమతి అవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాలిబన్ల ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఈ పంటను పండిస్తున్నారు. అక్కడి నుంచి అక్రమంగా ఈ మత్తుమందును వివిధ రూపాల్లోకి మార్చి ఎగుమతులు చేసి భారీగా ఆర్జిస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వంతో ధీటుగా తాలిబన్ల సంపాద ఉందంటే అర్ధం చేసుకోవచ్చు. ఇలా సంపాదించిన డబ్బుతో ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆఫ్ఘన్ మొత్తం తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో ఇంకెంత ఆదాయం ఆర్జిస్తారో చూడాలి. లక్షకోట్ల విలువైన గనులు ఆఫ్ఘన్‌లో ఉన్నాయి. వీటిపై ఇప్పటికే చైనా కన్నేసింది. గతంలోనే ఆఫ్ఘన్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సహకరిస్తామని చైనా చెప్పడం వెనుక ఉద్దేశం ఈ గనుల ఒప్పందాలే అని చెబుతున్నారు.
అమెరికా నిర్ణయంతో లాభాలు ఆర్జిస్తున్న తాలిబన్లు…
