NTV Telugu Site icon

The Sphere: ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డాగా స్పియర్‌.. ప్రత్యేతలు ఏంటంటే?

Spare

Spare

బిజీ లైఫ్ గడుపుతున్న జనాలకు కాస్త రిలాక్స్ అయ్యేలా చేసేవి సినిమాలు.. వీకెండ్ వస్తే చాలు సినిమాలను చూడటానికి థియేటర్ కు వెళతారు.. 3డీలో చూసే సినిమాల కోసం స్పెషల్‌ 3డీ గ్లాసెస్‌ ఇస్తుంటారు.. ఇప్పుడు మనం చెప్పుకొనేది 4డీ.. ప్రపంచంలోనే అతి పెద్ద గోళాకారం లో నిర్మించిన ఈ నిర్మాణమే స్పియర్‌.. ఇటీవలే ఈ స్పియర్‌ను ప్రారంభించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేదిక అసలు పేరు ఎమ్‌ఎస్‌జీ స్పియర్‌. ఇది అమెరికాలో లాస్‌ వెగాస్‌కు సమీపంలోని ప్యారడైజ్‌లో ఉంది.

సినిమాలు , సినిమాలకు సంబందించిన ఏదైనా షోలు, కచేరీలు, ఈవెంట్లు జరుపుకోవడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌ కు అక్కడి జనాలకు ఇది ఫర్ఫెక్ట్ అనే చెప్పాలి.. ఇక స్పియర్ ప్రత్యేకతలు, వివరాలు ఇవే..

ఈ స్పియర్ ను పాపులస్‌ అనే సంస్థ దీని రూపకల్పనకు నడుం బిగించింది.. ఇక దీని ఎత్తు 366 అడుగులు, వెడల్పు 516 అడుగులు. 18,600 సీట్ల సామర్థ్యం కలదు. వేదిక వెలుపలి భాగం లో 5,80,000 చదరపు అడుగుల ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉన్నాయి. వేవ్‌ఫీల్డ్‌, సింథసిస్‌ టెక్నాలజీతో ఉన్న స్పీకర్స్‌ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు.. 16కె రిజల్యూషన్‌ స్క్రీన్‌ క్వాలిటీ, 4డీ ఎఫెక్స్ట్‌ దీని ప్రత్యేకతను కలిగి ఉంటుంది.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ వేదికను నిర్మించడానికి అయిన ఖర్చు 2.3 బిలియన్‌ డాలర్స్‌ (భారతదేశ కరెన్సీ ప్రకారం రూ.19 వేల కోట్ల పైమాటే) ఉంటుందని చెబుతున్నారు.. మొత్తానికి స్పియర్ నెట్టింట మరోసారి వైరల్ అవుతుంది..