America: భారత దేశంలో ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు కనుక హిందూ దేవాలయాలు ఉండడం సర్వ సాధారణం. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో హిందూ దేవాలయం ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అది కూడా ప్రపంచం లోనే రెండవ అతి పెద్ద హిందూ దేవాలయం ఉంది అంటే నమ్ముతారా..? అవును అమెరికాలోని న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే నగరంలో ప్రంపచం లోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు. వివరాలలోకి వెళ్తే.. స్వామినారాయణ్ అక్షర్ ధామ్ మహా మందిర నిర్మాణం 2011లో మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ప్రారంభమైనది. కాగా ఈ మందిర నిర్మాణం 2023 లో పూర్తి అయింది. అంటే మందిర నిర్మాణానికి దాదాపుగా 12 సంవత్సరాలు పట్టింది. ఈ మందిర నిర్మాణం 120 ఎకరాలలో జరిగింది.
Read also:World Mental Health Day: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.. అసలు ఈ రోజు ఎలా వచ్చింది..
ఈ నిర్మాణంలో అమెరికా వ్యాప్తంగా 12 వేల మంది పాల్గొన్నారు. ఈ మందిర నిర్మాణానికి ఇటలీ బల్గేరియా నుంచి దిగుమతి చేసుకున్న నాలుగు విభిన్న రకాల పాలరాయి, సున్నపురాయిని ఉపయోగించారు. ఆలయ నిర్మాణం పురాతన హిందూ గ్రంధాల ప్రకారం జరిగింది. మొత్తం ఆలయ నిర్మాణంలో పది వేల విగ్రహాలను ఉపయోగించారు. దీనితోపాటుగా పురాతన భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ ఆలయంపై శిల్పాలను చెక్కించారు. ఈ ఆలయంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, 9 శిఖరాలు, 9 పిరమిడ్ లు ఉన్నాయి. ఈ ఆలయం 1000 సంవత్సరాలు ఉండేలా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు ఈ మహా మందిరాన్ని దర్శించుకునేందుకు అక్టోబర్ 18 నుంచి అనుమతి ఇవ్వనున్నారు.