USA: గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ భూ వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే ధృవాల వద్ద నీరు వేగంగా కరుగుతోంది. ఇదే కొనసాగితే రానున్న కొన్ని ఏళ్లలో సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంత పట్టణాలు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల నగరాలు హై రిస్క్‌లో ఉన్నాయి. 2050 నాటికి అమెరికాలోని తీర ప్రాంత నగరాల్లో ప్రతీ 50 మందిలో ఒకరు గణనీయమైన వరదల్ని ఎదుర్కొంటారని విశ్లేషణలు వెల్లడించాయి.
అమెరికాలోని మొత్తం 32 తీర ప్రాంత నగరాల్లో 24 నగరాల్లో ప్రతీ ఏడాది సముద్రమట్టం 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా పెరుగుతోంది. ఇందులో సగం నగరాల్లోని కొన్ని ప్రాంతాలు ప్రపంచ సముద్ర నీటి మట్టాల పెరుగుదల కన్నా ఎక్కువగా మునిగిపోతున్నట్లు తేలింది.
అమెరికాల్లో ప్రఖ్యాత న్యూయార్క్‌తో సహా బోస్టన్, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విల్మింగ్టన్, మిర్టిల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్‌విల్లే, మయామి, నేపుల్స్, మొబైల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లిడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్థర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టి, రిచ్మండ్, ఓక్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కో, సౌత్ శాన్ ఫ్రాన్సిస్కో, ఫోస్టర్ సిటీ, శాంటా క్రజ్, లాంగ్ బీచ్, హంటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాన్ డియాగో వంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.
Read Also: Kodali Nani: నాకు ఇవే చివరి ఎలక్షన్స్.. 2029 ఎన్నికల్లో పోటీ చేయను
2050 నాటికి అమెరికా తీర ప్రాంతాల వెంబడి సముద్రమట్టం 0.25-0.30 మీటర్లు పెరుగుతుందని నేచర్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది. తీవప్రాంతాల క్షీణత, తీరప్రాంత భూభాగాలు మునిగిపోవడం వల్ల సమస్య తీవ్రం అవుతుందని పేర్కొంది. రాబోయే మూడు దశాబ్ధాల్లో దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతారని, వరదల వల్ల 35 ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తుల్లో ఒకటి నష్టపోయే అవకాశం ఉందని అధ్యయనం అంచనా వేసింది. కొత్త అద్యయనం గత అధ్యయనాలను మార్చింది. మరో 500-700 చదరపు మైళ్ల భూమి ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, సముద్ర నీరు పెరగడం వల్ల 1,76,000 నుంచి 5,18,000 మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని విశ్లేషణ వెల్లడించింది. కేవలం యునైటెడ్ స్టేట్స్‌లోనే 94,000 నుండి 2,88,000 ఆస్తులు, 32 బిలియన్ నుండి 109 బిలియన్ డాలర్ల వరకు నష్టం అంచనా వేయబడ్డాయి.