Rishi Sunak: ఫ్యామిలీతో థియేటర్‌లో సినిమా చూసిన ప్రధాని .. ఎక్కడ? ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak: రాజకీయాల్లో ఉన్న వారు కుటుంబానికి సమయం కేటాయించాలంటే కష్టమే. రాజకీయాల్లో ఉంటూ.. అందులో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా ఉండే వారు అయితే మరీ కష్టం. వారి చుట్టూ ఎప్పుడు రక్షణ వలయం ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలో ఉన్న వారు బయటికి ఎక్కడికి వెళ్లాలన్నా వారికి కల్పించాల్సిన రక్షణ పెద్ద సమస్యగా మారుతుంటుంది. అలాంటి ఒక దేశ ప్రధాని తన కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే అది సాధ్యం అవుతుందా? కానీ సాధ్యం చేశారు బ్రిటన్ ప్రధాని రిషి సునాంక్. హాలీవుడ్‌లో గత వీకెండ్‌లో రిలీజ్ అయిన బార్బీ సినిమాను భార్య, పిల్లలతో కలసి సాధారణ ప్రేక్షకుడిగా సినిమా థియేటర్‌కెళ్లి సినిమా చూశారు. సినిమా చూసిన అనంతరం తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు బ్రిటన్ ప్రధాని రిషీ సునాంక్..
Read also: Hyderabad: చిక్కడపల్లి బాయ్స్ హాస్టల్లో ఏపీ విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఇదే..!
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
గత వీకెండ్‌లో హాలీవుడ్‌లో రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ఒకటి క్రిస్టొఫర్ నోలన్ తీసిన ఓపెన్‌హైమర్ కాగా.. రెండోది గ్రేటా జర్విగ్ డైరెక్షన్‌లో వచ్చిన బార్బీ చిత్రం. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఈ రెండు చిత్రాలు కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి. ఓపెన్‌హైమర్ సినిమా విడుదలైన తొలి రోజే భారత్‌లో 20 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టుకుంది. ఇక బార్బీ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో హాలీవుడ్‌లో సందడి నెలకొంది. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైన నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ సైతం ఓ సామాన్య ప్రేక్షకుడిలా మారిపోయి.. తన భార్య అక్షిత మూర్తి, పిల్లలు కృష్ణ సునాక్, అనౌష్క సునాక్‌లతో కలిసి సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తానే స్వయంగా వెల్లడించారు. ఓపెన్‌హైమర్, బార్బీ ఈ రెండు చిత్రాల్లో ఏ మూవీకి వెళదామని ఫ్యామిలీని అడగగా.. బార్బీకే ఫ్యామిలీ ఓటు పడిందని సునక్ తెలిపారు. “కుటుంబం ఓటు ఎప్పుడూ ఒకే మార్గంలో వెళుతుందని.. మొదటిది బార్బీ” అని రిషి సునాక్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రిషి సునాక్ భార్య అక్షిత మూర్తితో పాటు, పిల్లలు కృష్ణ సునాక్, అనౌష్క సునాక్‌లు పింక్ కలర్ డ్రెస్ (బార్బీ స్టైల్)లో సినిమా చూడటానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
The family vote was only ever going one way…
Barbie first it is #Barbenheimer pic.twitter.com/mTOY25h4oV
— Rishi Sunak (@RishiSunak) July 22, 2023
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!