Site icon NTV Telugu

Harry Potter: పుస్తకం కొన్న ధర రూ.32 … అమ్ముడు పోయింది రూ.11లక్షలు..!

Harry Potter

Harry Potter

Harry Potter: కొన్నింటిని కొన్నప్పటికీ కంటే అమ్మేటప్పుడు తక్కువకు అమ్మాల్సి వస్తుంది. మరికొన్ని కొన్న ధర కంటే ఎక్కువకు అమ్ముడుపోతాయి. అటువంటి కోవలోకి వస్తుంది ఈ పుస్తకం. ఇది మామూలు పుస్తకం కాదు.. ప్రపంచ ప్రఖ్యాటి గాంచిన హ్యారీ పోటర్‌ పుస్తకం. అదీ మొదటి ఎడిషన్‌కు సంబంధించిన పుస్తకం. దీంతో ఆ పుస్తకానికీ అంత క్రేజీ ఏర్పడింది. దీంతో కొన్న ధర పదుల్లో ఉంటే.. లక్షల్లో అమ్ముడు పోపయింది..

Read also: Ambati Rambabu: మిస్టర్ గాలి కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై మీకున్న అభ్యంతరం ఏంటి?

హ్యారీ పోటర్ గురించి తెలియని వారు ఉండటం కష్టం. అదొక కల్పిత కథ అయినప్పటికీ.. ఈ సిరిస్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈసిరిస్ సినిమాగా వచ్చినా, పుస్తకంగా వచ్చినా ఎగబడి చూశారు. అయితే తాజాగా ఈ సిరీస్ కి సంబంధించి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ హ్యారీ పోటర్ కథలను అందించిన రచయిత జేకే రౌలింగ్ ఆ న్యూస్‌ను బయటకి తీసుకొచ్చారు. విషయానికి వస్తే, హ్యారీ పోటర్ అండ్ ఫిలాసఫర్స్ స్టోన్ అనే అరుదైన మొదటి ఎడిషన్ రిచర్డ్ వింటర్ టన్ వేలం నిర్వహించారు. ఈ పుస్తకం వేలంలో దాదాపు రూ.11లక్షలకు అమ్ముడుపోవడం విశేషం. లామినేటెడ్ బోర్డ్ కవర్‌తో 1997లో బ్లూమ్స్‌బరీ ప్రచురించిన ఈ పుస్తకం 500 మొదటి ఎడిషన్‌లో ఫస్ట్ ఇంప్రెషన్‌లో 500 పుస్తకాలను ముద్రించారు. వాటిలో ఒకటిగా ఈ పుస్తకం కూడా ఉండటం విశేషం. మొదటి ఎడిషన్‌లో 300 పుస్తకాలను లైబ్రరీలకు పంపించగా, దానిలో ఒక దానిని వేలం వేశారు. ఇది మొదటి కాపీ కావడంతో అందరూ ఎగబడి వేలంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. నిజానికి ఈ పుస్తకం ప్రింట్ సమయంలో దాని ధర కేవలం రూ.32 .. కాగా ఇప్పడు రూ.11లక్షలకు అమ్ముడు పోవడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఇంత ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం తమకు సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

Exit mobile version