Alaska Airlines: ప్రయాణికులను సురక్షితంగా తీసుకు వెళ్లాలని ప్రతి డ్రైవర్ అనుకుంటాడు. అలానే ఏదైనా ప్రమాదం సంభవిస్తే తన ప్రాణాలకంటే ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమని భావించి ప్రయాణికులను వీలైనంత వరకు కాపాడడానికే ప్రయత్నిస్తాడు. అయితే ఈ పైలెట్ మాత్రం భూమి నుండి 31000 వేల అడుగుల ఎత్తులో గాల్లో దూసుకుపోతున్న విమానం ఇంజన్ ను ఆపటానికి ప్రయత్నించాడు. ఈ ఘటన అలాస్కా ఎయిర్ లైన్స్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఆదివారం వాషింగ్టన్ డీసీ నుంచి శాన్‌ఫ్రాన్‌సిస్కో వెళుతున్న అలాస్కా ఎయిర్‌లైన్స్ లో ఓ పైలట్ ఎవ్వరు ఊహించని పనికి పాల్పడబోయాడు. 44 ఏళ్ల జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ పైలట్అనే ఆఫ్ డ్యూటీ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను విమానం కాక్‌పిట్ లోని జంప్ సీటులో కూర్చుని ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా అతను లేచి ఇంజన్లు ఆపేందుకు ప్రయత్నించాడు.
Read also:Hamas-Israel war: సీసీ కెమెరాకు చిక్కిన హమాస్ క్రూరత్వం.. బయటపెట్టిన ఇజ్రాయిల్
అయితే ఇది గమనయించిన పైలెట్, కోపైలేట్ సకాలంలో స్పందించారు. ఇంజన్ ఆపేందుకు ప్రయత్నించిన ఆఫ్ డ్యూటీలో ఉన్న పైలెట్ ను అడ్డుకున్నారు. దీనితో పెను ముప్పు తప్పింది. అనంతరం విమానాన్ని పోర్ట్‌లాండ్ ఎయిర్ పోర్టుకు మళ్లించి ఎమర్జన్సీ ల్యాండ్ చేశారు. జరిగిన ఘటన గురించి చెప్పి సదరు ఆఫ్ డ్యూటీ లో ఉన్న పైలెట్ ను అధికారులకు అప్పగించారు. అధికారులు అతనిని అరెస్ట్ చేసి నిందితుడిపైన కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు ఇలా ఇందుకు చేసాడు అనే విషయం పైన దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అయితే ఈ ఘటన గురించి అలాస్కా ఎయిర్ లైన్స్ అధికారులు మాట్లాడుతు ఆ సమయంలో విమానంలో 83మంది ఉన్నారని.. సకాలంలో స్పందించకపోయి ఉంటె ప్రయాణికులు మరణించేవారని.. కానీ అలాజరగకుండా సకాలంలో స్పందించి పెను ప్రమాదం జరగకుండా కాపాడనిన పైలెట్ ని కో పైలెట్ ని అభినందిస్తున్నామని తెలిపారు. కాగా నిబంధనల ప్రకారం..డ్యూటీలో లేని పైలట్లు విమానం కాక్‌పిట్‌లోని జంప్ సీటులో కూర్చుని ప్రయాణించవచ్చు. అదికూడా విమానం పైలట్ అనుమతి ఉంటేనే కాక్ పిట్ లో కూర్చునేందుకు వీలు ఉంటుంది.