NTV Telugu Site icon

China: వీసా గడువు పొడిగించకపోవడంతో ..చైనాను వీడనున్న ఆఖరి భారత జర్నలిస్టు

China And India

China And India

China: చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టుకు ఆ దేశం వీసా గడువును పొడిగించకపోవడంతో ఈ నెలాఖరు నాటికి చైనా నుంచి భారతీయ జర్నలిస్టులందరూ ఇండియాకు తిరిగి వచ్చేసినట్టు అవుతుంది. ఈ నెలాఖరుతో సదరు జర్నలిస్టు వీసా గడువు ముగియనుంది.. అయితే చైనాలో వీసాపై నిషేధాజ్ఞలు విధించి.. వీసా గడువును పొడిగించకపోవడంతో ఇక చైనాలో భారతీయ జర్నలిస్టులు లేకుండా పోనున్నారు.

Read also: Sriya Reddy: పవన్ ఓజీలో విశాల్ రెడ్డి వదిన.. పవర్ ఫుల్ అంటూ ట్వీట్

2020 మధ్యలో చైనా-భారత్ సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 24 మంది మృతి చెందడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటి నుండి దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. భారత్‌లో తమ రిపోర్టర్‌లకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టును దేశం విడిచి వెళ్లాలని చైనా పేర్కొంది. చైనాకు చెందిన జర్నలిస్టులు భారత్‌లో అన్యాయానికి, వివక్షకు గురవుతున్నారని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ సోమవారం ఆరోపించారు. 2020లో మొత్తం 14 మంది చైనా జర్నలిస్టులు భారత్‌లో ఉండగా, అక్కడి పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఒక్కరే మిగిలారని ఆయన పేర్కొన్నారు. అయితే చైనా ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. గతనెలలో భారత్‌లో జరిగిన ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా జర్నలిస్టులకు అనుమతులు ఇచ్చామని భారత్‌ స్పష్టం చేసింది. ఇండియాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చైనా జర్నలిస్టులు పని చేస్తున్నారని … కానీ చైనాలో అలాంటి పరిస్థితులు లేవని పేర్కొంది.

Read also: Bhatti Vikramarka: నాగార్జునసాగర్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

ప్రస్తుతం చైనాలో కొనసాగుతున్న పీటీఐకి చెందిన జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈనెల చివరి నాటికి ఆ జర్నలిస్టు తిరిగి రానున్నారు. 2023 ప్రారంభంలో నలుగురు భారతీయ జర్నలిస్టులు చైనాలో ఉండగా.. వీసాపై నిషేధాజ్ఞలు విధించడంతో ఇద్దరు స్వదేశానికి చేరుకున్నారు. వీసా గడువు ముగియడంతో జూన్‌ 11న మరొకరు జర్నలిస్టు కూడా ఇండియాకి వచ్చేశారు. తాజాగా ఆఖరి జర్నలిస్టు వీసా ఈ నెలాఖరు వరకు ఉండటంతో.. వీసా గడువును చైనా పొడిగించకపోవడంతో అతను కూడా భారత్‌కు రానున్నారు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నెలలో భారతీయ జర్నలిస్టులను చైనాలో పని చేయడానికి చైనా అనుమతిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. విదేశీ జర్నలిస్టులందరికీ అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి భారతదేశం అనుమతించిందని తెలిపింది.