యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి ప్రపంప దేశాలపై విరుచుకుపడుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ ప్రభావంతో కరోనా కేసులు కూడా భారీ పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 16.39 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.
అంతేకాకుండా తాజాగా మరో 5,900 మంది కరోనాతో మరణించారు. అయితే లండన్‌లో ప్రతి 15 మందిలో ఒకరికి పాజిటివ్ వస్తున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. దీనితో పాటు అమెరికాలో సైతం కోవిడ్ విజృంభనతో కొత్తగా 4.43 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో 2.32 లక్షలు, బ్రిటన్‌లో 1.89 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
