Site icon NTV Telugu

ఒమిక్రాన్‌తో ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం: డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌ వేరింయట్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సారి కనుక ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరిగి ఆస్పత్రుల్లో వైద్యం కోసం చేరితే ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దేశ ప్రభుత్వాలదేనని తెలిపింది. కరోనా కొత్త వేరింయట్‌ ఒమిక్రాన్‌ ఇప్పటి వరకు 89 దేశాలకు వ్యాపించినట్లు who తెలిపింది. ఈ వేరియంట్‌ సోకిన ప్రాంతాల్లో కేసులు, రెండు మూడు రోజుల్లోనే రెట్టింపు అవుతున్నట్లు వెల్లడించింది.

Read Also: పిటి ఉషపై పోలీస్‌ కేసు నమోదు

దీని కట్టడికి గ్రామ స్థాయిలోనే ప్రజారోగ్య చర్యలు మరింత ముమ్మరం చేయాలని సూచించింది. ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగానే ఉన్నా.. కేసుల సంఖ్య పెరిగితే ఆస్పత్రులపై మళ్లీ ఒత్తిడి పెరుగుతుందని ఈ సారి ఆస్పత్రులు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవ్వాలని, దీని కన్నా ముందు అలాంటి పరిస్థితులే రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం అని తెలిపింది. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. కోవిడ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో బూస్టర్‌ డోసుల అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే బూస్టర్‌ డోసులు తీసుకున్న దేశాలు పేద దేశాలకు టీకాలు ఉదారంగా పంపిణీ చేసి ఆదుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

Exit mobile version