Same Gender marriage: థాయ్‌లాండ్‌లో స్వలింగ వివాహాలను చట్టబద్ధత..
- స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్ణయం..
- వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్ కర్ణ్ సంతకం..
- బిల్లుకు థాయ్ రాజు ఆమోద ముద్ర వేయడంలో ఆనందం వ్యక్తం చేసిన ఎల్‌జీబీటీక్యూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Same Gender marriage: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు వీలు కల్పించేలా చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్ కర్ణ్ తాజాగా సంతకం పెట్టారు. దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచ్చిన ప్రథమ దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. కాగా, 2025 జనవరి 22వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతుందని థాయ్ లాండ్ సర్కార్ ప్రకటించింది. దీని ప్రకారం వివాహ చట్టంలో భార్య, భర్త లాంటి పదాలకు బదులుగా ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు ఉపయోగించనున్నారు.
Read Also: BSNL: అతి తక్కువ ధరలో ఇంటర్నెట్ రాకెట్ వేగంతో 5000GB డేటా!
Also Read
- Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
- Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్‌పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
- Nvidia CEO Controversy: 'నేను నా భార్యకు ద్రోహం చేశాను,'.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమేనన్న ఎన్విడియా సీఈఓ
- Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
ఇక, స్వలింగ జంటకు దత్తత, వారసత్వంతో పాటు పూర్తిస్థాయి ఆర్థిక, వైద్య, చట్టపరమైన హక్కులు లభించనున్నాయి. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే స్వలింగ సంపర్కు (ఎల్జీబీటీక్యూ)లకు థాయ్‌లాండ్‌లో మొదటి నుంచీ స్వేచ్ఛ ఎక్కువేనే ఉంది. అయితే, పూర్తిస్థాయి హక్కుల కోసం వాళ్లు గత 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే, సంబంధిత బిల్లు జూన్‌లో సెనేట్ ఆమోదం పొందినప్పటికి.. మంగళవారం రాజు ఆమోదం తెలిపడంతో అది చట్టరూపం దాల్చింది.
Read Also: Dattatreya Stotram: ఇష్టకామ్యాలను అనుగ్రహించే అభిషేక సహిత శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం
కాగా, ఇది చరిత్రాత్మకమంటూ ఎల్జీబీటీక్యూ ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేశారు. చరిత్రలో చెరిగిపోని ఒక పేజీని లిఖించుకున్నామని స్వలింగ సంపర్కులు అంటున్నారు. సమానత్వానికి, మానవ గౌరవానికి దక్కిన విజయమిదని ఎల్జీబీటిక్యూ హక్కుల కోసం దీర్ఘకాలంగా పని చేస్తున్న చుమాపోన్ పేర్కొన్నారు. చట్టం అమల్లోకి రావడంతో 2025 జనవరి 22వ తేదీన 1,000కి పైగా ఎల్జీబీటీక్యూ జంటలకు సామూహిక పెళ్లిలు చేసుకునే యోచన ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, తైవాన్, నేపాల్ తర్వాత ఆసియాలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడవ దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. తైవాన్ 2019లో తొలిసారి ఈ బిల్లుకు ఆమోదం తెలపగా.. ఆ తర్వాత నేపాల్ సుప్రీంకోర్టు కూడా ఎల్జీబీటీక్యూ బంధాల చట్టబద్ధతకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అమలు జరుగుతుంది.. ఇప్పుడు థాయ్ లాండ్ లో కూడా స్వలింగ వివాహాల బిల్లుకు ఆమోదం దొరికింది.
తాజావార్తలు
-
Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
-
Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
-
Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 కంటే మెరుగైన ఫలితాలు!
-
Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
ట్రెండింగ్
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!