Site icon NTV Telugu

Thailand: కంబోడియాలో విష్ణువు విగ్రహాన్ని అందుకే కూల్చాం.. థాయ్‌లాండ్ వివరణ

Thailand

Thailand

థాయ్‌లాండ్-కంబోడియా మధ్య గత కొద్ది రోజులుగా సరిహద్దు వివాదంపై ఘర్షణ జరుగుతోంది. ఇరు దేశాలు సైనిక చర్యలకు దిగుతున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలో కంబోడియా సరిహద్దులో ఉన్న విష్ణువు విగ్రహాన్ని థాయ్‌లాండ్ కూల్చేసింది. ఈ ఘటనపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి అగౌరవకరమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుచరుల మనోభావాలను దెబ్బతీస్తాయని.. ఇలా జరగకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

తాజాగా భారత్ అభ్యంతరంపై థాయ్‌లాండ్ స్పందించింది. భద్రత కోసమే విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేశామని.. అంతేతప్ప హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి కాదని థాయ్‌లాండ్ స్పష్టం చేసింది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో కావాలనే కంబోడియా సైనికులు విగ్రహాన్ని నిర్మించిందని.. ఆ ప్రాంతం తమదేనని అందుకోసమే భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని కూల్చేసినట్లుగా వెల్లడించింది. వాస్తవంగా ఆ ప్రాంతం మతపరమైన ప్రాంతం కూడా కాదని.. ఉద్దేశపూర్వకంగా కంబోడియా సైనికులు నిర్మించారని పేర్కొంది.

థాయ్‌లాండ్-కంబోడియా మధ్య గత కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని శాంతి ఒప్పందం చేశారు. ట్రంప్ సమక్షంలోనే ఇరు దేశాధినేతలు సంతకాలు కూడా చేశారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.

 

Exit mobile version