NTV Telugu Site icon

Thai Warship Sinks: నీట మునిగిన భారీ యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు

Thai Warship Sinks

Thai Warship Sinks

Thai warship sinks in severe weather leaving 31 crew missing: సోమవారం గల్ఫ్‌ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఒక థాయ్ యుద్ధ నౌక (హెచ్‌టీఎంస్‌ సుఖొథాయ్‌) ప్రమాదవశాత్తూ నీట మునిగింది. బలమైన ఈదురుగాలుల కారణంగా.. సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరింది. మొబైల్ పంపింగ్ మిషన్ల ద్వారా లోపలికి వచ్చిన నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ.. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడం, ఇంజిన్ కూడా పని చేయకపోవడంతో ఆ నౌకలోకి మరింత నీరు వచ్చి చేరింది. దీంతో.. ఆ నౌక ఒకవైపుకి ఒరుగుతూ, సముద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఆ నౌకలో మొత్తం 106 మంది నేవీ సిబ్బంది ఉండగా.. 31 మంది గల్లంతయ్యారు. మరో 75 మందిని సహాయక సిబ్బంది కాపాడగలిగింది.

Lionel Messi: యూ-టర్న్ తీసుకున్న మెస్సీ.. ఫ్యాన్స్‌కి పండగే!

థాయ్‌లాండ్‌లోని ప్రచుప్‌ ఖిరి ఖాన్‌ ప్రావిన్స్‌లో సముద్ర తీరానికి 20 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ యుద్ధ నౌక ఆదివారం సాయంత్రం విధుల్లో పాల్గొంది. అయితే.. ఇంతలోనే అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో, ఈ నౌక ప్రమాదానికి గురైంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే.. థాయ్ నౌకాదళం సంఘటనా స్థలానికి వెంటనే మూడు ఫ్రిగెట్లు, రెండు హెలికాప్టర్లను పంపించింది. ఎలాగైనా నీట మునగకుండా ఆ నౌకను కాపాడేందుకు వాళ్లు సహాయక సిబ్బంది వారు తీవ్రంగా శ్రమించారు. కానీ, బలమైన గాలుల కారణంగా అది సాధ్యపడలేదు. గల్లంతైన 31 మంది కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో నావికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్తున్నారు.

Fifa World Cup: వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓటమి.. ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లు

ఈ 960 టన్నుల సుఖోథాయ్‌ని యునైటెడ్ స్టేట్స్‌లో నిర్మించి, 1987లో థాయ్ నేవీలో విధుల్లోకి తీసుకొచ్చారు. ఇది పాత నౌక కావడంతో.. ప్రమాద సమయంలో అందులోని నేవీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని ఓ రిటైర్డ్ యూఎస్ నేవీ కెప్టెన్ పేర్కొన్నారు. ఒక్కసారి విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే.. లోపల చీకటి కమ్ముకుంటుందని, అప్పుడు ఏం చేయడానికి వీలుండదని తెలిపారు. కాగా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ థాయ్ నౌక మునిగిపోవడం, ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొంటున్నారు.