Site icon NTV Telugu

Charlie Kirk: చార్లీ కిర్క్‌ హత్యపై అపహాస్యం.. టెక్సాస్ వర్సిటీ నుంచి విద్యార్థి బహిష్కరణ

Charlie Kirk2

Charlie Kirk2

చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది. సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సంతాపం వ్యక్తం చేశారు. ఇక అమెరికా ప్రజలు కన్నీటిపర్యంతం అయ్యారు.

అమెరికన్లు దు:ఖం.. బాధలో ఉండగా ఓ విద్యార్థి మాత్రం చార్లీ కిర్క్ హత్యను అపహాస్యం చేశాడు. ఎగతాళి చేస్తూ నటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: PM Modi-Netanyahu: దేశం కోసం చాలా సాధించారు.. ఇజ్రాయెల్ ప్రధాని స్పెషల్ వీడియో విడుదల

చార్లీ కిర్క్ స్థాపించిన టర్నింగ్ పాయింట్ సభ్యులు.. టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సోమవారం స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఒక విద్యార్థి మాత్రం నీచంగా ప్రవర్తించాడు. సభ్యత, సంస్కారం మరిచి చార్లీ కిర్క్ హత్యను అపహాస్యం చేశాడు. చార్లీ కిర్క్ ఎలా హత్యకు గురయ్యారో నటిస్తూ ఎగతాళి చేశాడు. దీన్ని ఒకరు వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారంది. ఈ వీడియోలో చాలా మంది విద్యార్థులు ఎగతాళి చేసినట్టుగానే కనిపించారు. ఎవరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ప్రేక్షకుల్లా చూస్తూనే ఉండిపోయారు తప్ప ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

ఇది కూడా చదవండి: KTR: కాళేశ్వరంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో మనం విఫలమయ్యాం..

అయితే వీడియో వైరల్ కావడంతో టెక్సాస్ స్టేట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ కెల్లీ డాంప్‌హౌస్ సోషల్ మీడియాలో స్పందించారు. వీడియోలో కనిపించిన విద్యార్థిని గుర్తించామన్నారు. 18 ఏళ్ల కామ్రిన్ గిసెల్లె బుకర్‌గా గుర్తించారు. ఇప్పటికే యూనివర్సిటీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. ఇక వీడియోలో విద్యార్థి అసభ్య పదజాలాన్ని కూడా ఉపయోగించినట్లు కూడా గుర్తించారు.

ఇక ఈ వీడియోపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ మండిపడ్డారు. ఈ ప్రవర్తన మన పాఠశాలల్లో ఆమోదయోగ్యం కాదన్నారు. విద్యార్థిని వెంటనే బహిష్కరించాలని కోరారు. హత్యను ఎగతాళి చేసే వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

 

Exit mobile version