Site icon NTV Telugu

Texas School Shooting: అమెరికాలో ఫైరింగ్… స్కూల్ పిల్లలతో సహా 21 మంది దుర్మరణం

Uvalde Texas Elementary School Shooting Ap 05 24 22

Uvalde Texas Elementary School Shooting Ap 05 24 22

అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. అక్కడ గన్ కల్చర్ ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తోంది.ఇటీవల కాలంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో అభంశుభం తెలియని స్కూల్ పిల్లలు మరణించారు. ఓ వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది స్కూల్ పిల్లలు, మరో ముగ్గురు మొత్తంగా 21 మంది చనిపోయారు. టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గవర్నర్ గ్రెగ్ అబాట్ ధ్రువీకరించారు. మొత్తం 21 మందిలో ఇద్దరిని కొనఊపిరితో ఆస్పత్రికి చేర్చగానే మరణించినట్లు వెల్లడించారు. చనిపోయిన పిల్లల్లో ఎక్కువ మంది 4 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయసున్న వారే అధికంగా ఉన్నారు.

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని సాల్వడార్ రామోస్ గా పోలీసులు ధ్రువీకరించారు. ఇతడు ఓ హత్య నేరంలో అనుమానితుడిగా ఉన్నాడు. పోలీసులు వెంబడిస్తున్న సమయంలో అతను తన ట్రక్కు నుంచి దిగి రాబ్ ఎలిమెంటరీ స్కూల్ లోకి ప్రవేశించి స్కూల్ పిల్లలపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తెలుసుకుని వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఘటనకు పాల్పడిని రామోస్ ను పోలీసులు కాల్చి చంపేశారు.

ఇటీవల కాలంలో అమెరికాలో వరసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం న్యూయార్క్ బఫెల్లో లోని ఓ సూపర్ మార్కెట్ లో కాల్పులు జరిగాయి. నల్లజాతీయులే లక్ష్యంగా జరిగిన ఈ కాల్పుల్లో 10 మంది మరణించారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు కూడా ఇలాగే ఓ సబ్ వేలో కాల్పలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశాలు ఇచ్చాడు.

Exit mobile version