NTV Telugu Site icon

Tesla: మార్కెట్లోకి టెస్లా రోబోవ్యాన్‌.. ఆవిష్కరించిన ఎలాన్‌ మస్క్‌

Elon Musk

Elon Musk

Tesla: టెస్లా సీఈవీ ఎలాన్‌ మస్క్‌ తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్య పర్చేశారు. కాగా, ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్‌ను ‘వీరోబో’ ప్రోగ్రాంలో ప్రదర్శించారు. కాలిఫోర్నియాలోని వార్నర్‌ బ్రదర్స్‌ ప్రాంగణంలో దీనిని నిర్వహించారు. కాగా, రోబోవ్యాన్‌ సాధారణ డిజైన్లకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అది రైలు ఇంజిన్‌ లాంటి డిజైన్‌లో తయారు చేశారు. అయితే, దీని చక్రాలు బయటకు కనిపించకడం లేదు. దీన్ని 20 మంది ప్రయాణికులను లేదా సరకులను తరలించేందుకు ఉపయోగించొచ్చని టెస్లా సంస్థ చెప్పుకొచ్చింది.

Read Also: Pakistan: పాకిస్థాన్లో దారుణం.. బొగ్గు గనిలో 20 మంది కార్మికులను చంపిన టెర్రరిస్టులు..

కాగా, ఈ వ్యాను మైలు దూరం ప్రయాణించడానికి 5 నుంచి 10 సెంట్ల వరకు ఖర్చవుతుందని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వెల్లడించింది. దీనిని అటానమస్ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కోసం నిర్మించినట్లు సమాచారం. దీంతో టెస్లా మాస్‌ ట్రావెల్‌ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటి వరకు ఆ సంస్థ వాహనాల లైనప్‌ కేవలం చిన్నవాటి పరిమితమైంది. అయితే, రెండు డోర్లతో ఉన్న ఈ కారుకు స్టీరింగ్‌ వీల్‌, పెడల్స్‌ లేవు.. దానిని ఎలాన్ మస్క్‌ సైబర్‌ క్యాబ్‌ అని వీక్షకులకు పరిచయం చేశారు. దీని తయారీ 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిని కస్టమర్లు 30,000 డాలర్ల కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చన్నారు. ప్రతీ మైలు ప్రయాణానికి 20 సెంట్లు ఖర్చవుతుందని చెప్పుకొచ్చారు. అటానమస్‌ కార్లను సాధారణ వాహనాల కంటే 5 నుంచి 10 రెట్లు అదనంగా ఉపయోగించవచ్చని ఎలాన్ మస్క్ వెల్లడించారు.

Show comments