Site icon NTV Telugu

Israel-Hamas War: “టెస్లా” కారా మజాకా.. హమాస్ అటాక్ నుంచి వ్యక్తిని కాపాడింది..

Tesla Car

Tesla Car

Israel-Hamas War: హమాస్ ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయిల్ క్రూరమైన దాడిని ఎదుర్కొంది. గాజా నుంచి వచ్చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి సాధారణ ప్రజానీకంపై దారుణాలకు ఒడిగట్టారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చారు. మహిళపై హత్యాచారాలకు ఒడిగట్టారు. రోడ్లపై వెళ్తున్న కార్లను షూట్ చేశారు. కార్ల పెట్రోల్ ట్యాంకులను, ఇంజన్ల టార్గెట్ చేసి, అవి ఆగిపోయిన తర్వాత నిస్సాయకంగా ఉన్న వ్యక్తుల్ని కాల్చి చంపారు.

ఇదిలా ఉంటే ఓ వ్యక్తి మాత్రం తనను ఎలాన్ మస్క్ ‘టెస్లా’ కారు కాపాడిందని వెల్లడించారు. టెస్లా మోడల్ 3 పెర్ఫార్మెన్స్ కార్ ఓనర్ ప్రాణాలు కాపాడిందని ఇజ్రాయిలీ పబ్లికేషన్ వాల్లా వెల్లడించింది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ విషయం తెలియని సదరు టెస్లా ఓనర్ ఓ మీటింగ్ కోసం వెళ్తున్నారు. అయితే ఊహించని విధంగా హమాస్ ఉగ్రవాదులు ఏకే తుపాకులు, మిషన్ గన్స్‌తో తన కారు వద్దకు రావడాన్ని చూశారు.

Read Also: Super Visa: కెనడాలో ఉంటున్న వారికి గుడ్ న్యూస్.. తల్లిదండ్రులతో నివాసం ఇక సులువు..

ఉగ్రవాదులు టెస్లాను ఎలక్ట్రిక్ కారని గుర్తించక, సాధారణ పెట్రోల్ కారుగా భావించి ట్యాంకు, ఇంజన్ ఉన్న చోట్ల కాల్పులు జరిపారు. ఇలా చేస్తే కారు ఆగిపోవడం లేకపోతే ఇంధన ట్యాంక్ పేలిపోతుందని భావించారు. అయితే ఈవీ కార్ కావడంతో ఈ ముప్పు నుంచి తప్పించుకుంది.

కార్ యాక్సిలరేషన్, డ్యూయర్-డ్రైవ్ సిస్టమ్ అతని ప్రాణాలు కాపాడింది. దాడి నుంచి వెంటనే కారును దూరంగా తీసుకెళ్లేందుకు కారణమైందని అతను చెప్పాడు. కారుపై బుల్లెట్ దెబ్బలు లేని చోటే లేదని, కారు అలాగే డ్రైవ్ చేసుకుందని, కార్ బ్యాటరీ వెడెక్కలేదని అని చెప్పాడు. అతని భార్య టెస్లా యాప్ ద్వారా అతని లొకేషన్, ఎమర్జెన్సీ రూమ్ లో అడ్మిషన్ గురించి రియల్ టైమ్ అప్‌డేట్స్ పొందగలిగింది.

Exit mobile version