NTV Telugu Site icon

ISIS: ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ హసన్ అల్ ఖురాషీ హతం..

Isis

Isis

Terror Group ISIS Says Its Leader Abu Hasan Al-Qurashi Killed: ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కీలక నాయకుడు అబూ హసన్ అల్ ఖురాషీ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఐసిస్ ప్రతినిధి వెల్లడించారు. ‘దేవుడి శత్రువులతో జరిగిన యుద్ధం’లో చంపబడ్డాడని బుధవారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఆడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని ఐసిస్ ప్రకటించింది. ఈ ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తిని కొత్త నాయకుడు అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సేనీ అల్-ఖురాషీగా గుర్తించారు. అయితే దాడి ఎక్కడ జరిగింది, ఎప్పుడు అబూ హసన్ అల్ ఖురాషీ మరణించాడనే విషయాలను వెల్లడించలేదు.

Read Also: Liger Scam: ముగిసిన ఈడీ విచారణ.. విజయ్ ఏం చెప్పాడంటే..?

2014లో ఇరాక్, సిరియాల్లో ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా( ఐఎస్ఐఎస్) స్థాపించబడింది అతని కాలంలోనే భయంకరమైన ఉగ్రవాద సంస్థగా మారింది. ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఏర్పడిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ క్రమంగా తన బలాన్ని కోల్పోతోంది. ఇరాక్, సిరియాల్లో తొలుత ఆధిపత్యం చెలాయించిన ఐసిస్ క్రమంగా ఆ దేశాల భద్రతా బలగాల దాడితో క్రమంగా క్షీణించింది. 2017లో ఇరాక్ ను, మరో రెండేళ్ల తరువాత సిరియాలో ఐసిస్ ఓడిపోయింది. అయితే ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ మాత్రం ఇప్పటికీ యాక్టీవ్ గానే ఉన్నాయి. ఇప్పటికీ ఈ రెండు దేశాల్లో అక్కడక్కడ దాడులు చేస్తున్నాయి. గతంలో ఐఎస్ ముఖ్య నాయకుడు అబూ ఇబ్రహీం అల్ ఖురాషీ ఈ ఏడాది ప్రారంభంతో యూఎస్ఏ జరిపిన దాడిలో ఉత్తర సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్సుల్లో మరణించాడు. ఈయన కన్నా ముందు ఐసిస్ హెడ్ గా ఉన్న అబూ బకర్ అల్ బాగ్దాదీ కూడా అక్టోబర్ 2019లో ఇడ్లిబ్ లోనే హతమయ్యాడు.