NTV Telugu Site icon

Israel: ఇజ్రాయిల్‌లో ఉగ్రదాడి.. పాదచారులపైకి వాహనం..

Israel

Israel

Israel: ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఓ వైపు కాల్పుల ఒప్పందం జరుగుతుంటే, మరోవైపు అనుమానిత ఉగ్రదాడులు ఇజ్రాయిల్‌ని కలవరపెడుతున్నాయి. గురువారం ఉత్తర ఇజ్రాయిల్‌లో పాదచారుల పైకి ఒక వాహనం దూసుకెళ్లింది. దీనిని పోలీసులు అనుమానిత ఉగ్రదాడిగా అభివర్ణించారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు గాయపడ్డారు.

Read Also: Mohammad Rizwan: జట్టు ప్రదర్శనపై ఎలాంటి సాకులు వెతకడం లేదు..

“ఇది ఉగ్రవాద దాడి అనే అనుమానం ఉంది. హైఫా నగరానికి దక్షిణంగా ఉన్న కర్కూర్ జంక్షన్ వద్ద పోలీసు దళాలు అనుమానాస్పద వాహనాన్ని విజయవంతంగా అడ్డుకున్నాయి, ఈ దాడికి కారణమని అనుమానిస్తున్న అనుమానితుడిని పట్టుకున్నాయి” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.