Google Job: 39 సార్లు ప్రయత్నించాడు.. చివరికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taylor Cohen Gets Dream Job In Google After 39 Rejections: ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది. దానిని నెరవేర్చుకునేందుకు దాదాపు అందరూ ప్రయత్నిస్తారు. కానీ, కొందరు మాత్రమే దాన్ని సాకారం చేసుకోగలరు. ఇతర బాధ్యతల కారణంగా.. తమ డ్రీమ్‌ని పక్కనపెట్టేసి, వచ్చిన దాంతోనే సర్దుబాటు చేసుకుంటారు. ఇంకొందరు.. ప్రయత్నాలు బెడిసికొట్టి, మళ్లీ ప్రయత్నించలేక చేతులు ఎత్తేస్తారు. కానీ.. ఒక వ్యక్తి మాత్రం అలా కాదు. తన కోరిక నెరవేరే దాకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చాడు. చివరికి తన డ్రీమ్ జాబ్‌ని సాధించాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. అతని పేరు టైలర్ కొహెన్. యూఎస్‌లోని శాన్‌ప్రాన్సిస్కోకు చెందిన అతనికి గూగుల్‌లో ఉద్యోగం సంపాదించాలన్నదే లక్ష్యం. అందుకోసం అతడు ఏకంగా 39 సార్లు ప్రయత్నించాడు. ఇతర ఉద్యోగాలు చేస్తూనే.. గూగుల్‌కు దరఖాస్తు చేస్తూ వచ్చాడు. 2019 ఆగస్టు 25వ తేదీన ఇతను తొలిసారి గూగుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్నుంచి తిరస్కరణ పర్వం మొదలైంది. ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా, మానసికంగా ఎప్పుడూ కుంగిపోలేదు. ఈసారి కచ్ఛితంగా ఉద్యోగం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసంతోనే ముందడుగు వేశాడు. ఎట్టకేలకు 2022 జులై 19వ తేదీన అతని కల నెరవేరింది. తన డ్రీమ్ ఉద్యోగాన్ని పొందాడు. దీంతో.. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా, ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
‘‘పట్టుదలకు, పిచ్చితనానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. ఆ రెండింటిలో నాకుంది ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. 39 రిజెక్ట్ అయ్యాడు. చివరికి గూగుల్‌లో ఉద్యోగం సాధించాను’’ అంటూ గూగుల్‌తో జరిపిన ఈ-మెయిల్ సంభాషణల్ని కొహెన్ షేర్ చేశాడు. అది వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు అతనికి అభినందనలు తెలియజేశారు. పట్టు వదలకుండా ఉద్యోగం సాధించిన నువ్వు, ఎందరికో ఆదర్శం అంటూ అతడ్ని కొనియాడుతున్నారు.
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!