NTV Telugu Site icon

Afghanistan: ఆఫ్ఘన్‌లో బహిరంగంగా మరణశిక్ష.. తాలిబాన్ అధికారం చేపట్టాక ఇదే తొలిసారి

Taliban

Taliban

Taliban Publicly Execute Murder Accused, First After Afghanistan Takeover: ఆఫ్ఘానిస్తాన్ దేశంలో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా బహిరంగ మరణశిక్షను విధించింది. హత్య నిందితులను బహిరంగంగా శిక్షించింది. పశ్చిమ ఫరా ప్రావిన్స్ లో 2017లో ఓ వ్యక్తిని పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని బహిరంగంగా మరణశిక్ష విధించినట్లు తెలిపింది తాలిబాన్ ప్రభుత్వం. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చారు.

Read Also: Election Results: నేడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు.. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల్లో ఉత్కంఠ

హత్యా నేరంలో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఉరిశిక్ష విధించబడిందని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ కేసును ఇప్పటి వరకు మూడు కోర్టులు విచారించాయని.. ఉరిశిక్ష అమలుకు సుప్రీంలీడర్ ఆదేశాలు ఇచ్చారని ఆయన అన్నారు. తాత్కాలిక అంతర్గత మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ, తాత్కాలిక ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్, అలాగే దేశ ప్రధాన న్యాయమూర్తి, తాత్కాలిక విదేశాంగ మంత్రి మరియు తాత్కాలిక విద్యా మంత్రితో సహా డజనుకు పైగా సీనియర్ తాలిబాన్ అధికారులు ఉరిశిక్షకు హాజరయ్యారు. అయితే నిందితుడికి ఏ విధంగా మరణశిక్ష అమలు చేశారనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.

ఈ ఘటనకు ముందు దోపిడి, వ్యభిచారం నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్త్రీ, పురుషులను బహిరంగంగా కొరడా దెబ్బలు కొట్టి శిక్షించింది తాలిబాన్ గవర్నమెంట్. ఇదిలా ఉంటే ఈ శిక్షల అమలుపై యూఎన్ మానవహక్కుల సంస్థ స్పందించింది. బహిరంగంగా కొరడా శిక్ష అమలును నిలిపివేయాలని కోరింది. 1996-2001 మధ్యకాలంలో తాలిబాన్ అధికారంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో కొరడా దెబ్బలతో పాటు, రాళ్లతో కొట్టిచంపడం, బహిరంగంగా ఉరేయడం వంటి శిక్షలు ఎక్కువగా అమలు అయ్యాయి. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం నేరాలకు అత్యంత ఖఠినమైన శిక్షలు ఉంటాయి. హత్య, దొంగతనం, డ్రగ్స్, వ్యభిచారం వంటి నేరాలకు దారుణం అయిన శిక్షలను విధిస్తుంటాయి ఇస్లామిక్ దేశాలు. సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్ వంటి దేశాల్లో ఇలాంటి చట్టాలు అమలులో ఉన్నాయి.